డిస్లయిక్స్ గోల ఇంకా చల్లార్లేదుగా..

Update: 2017-02-25 17:31 GMT
''డిజె దువ్వాడ జగన్నాథమ్'' టీజర్ కు ఇప్పటివరకు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 32,45,021 లక్షలమంది టీజర్ ను చూశారు. అంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజులో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే అన్నేసి వ్యూస్ వచ్చిన ఈ టీజర్ కు ఇప్పటివరకు 84వేల లైక్స్ వస్తే.. 68 వేల డిస్లయిక్స్ కూడా వచ్చాయి. అసలు నిజంగానే ఈ టీజర్ అంతమందికి నచ్చలేదా?

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో మెదులుతున్న వార్తలను బట్టి చూస్తే.. ''చెప్పను బ్రదర్'' అంశంతో హర్టయిన పవన్ కళ్యాణ్‌ అభిమానులు కావాలనే ఇలా డిస్లయిక్స్ కొట్టేస్తున్నారని తెలుస్తోంది. మనోళ్ళు బన్నీ టీజర్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఇప్పుడు ఏకంగా సినిమా టీజర్ డిస్లయిక్స్ లో రికార్డు సృష్టించే స్థాయికి తీసుకెళ్లారు. అందుకే లైక్స్ కు ఈక్వల్ గా డిస్లయిక్స్ కూడా కనిపిస్తున్నాయి. సాధారణ సినిమా లవ్వర్స్ ఎవరైనా కూడా నిజంగానే టీజర్ నచ్చకపోయినా అసలు డిస్లయిక్ మాత్రం కొట్టరు. కాని ఇలా పిచ్చెక్కించే రేంజులో డిజ్లయిక్ చేయడం మాత్రం.. డిజె టీజర్ కే చెల్లింది.

ఇకపోతే టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. అందరికీ థ్యాంక్స్.. అంటూ అల్లు అర్జున్ ట్వీటేసి థ్యాంక్స్ చెప్పాడి. అది సంగతి.


Tags:    

Similar News