ఈ జనరేషన్‌కు తగ్గట్లు చాలా ట్రెండీగా ఉంటాడు అల్లు అర్జున్. అందుకే యూత్‌లో చాలా వేగంగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఫేస్ బుక్‌లో బన్నీ ఎప్పట్నుంచో ఫేమస్. సౌత్ ఇండియాలో తిరుగులేని ఫేస్ బుక్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో బన్నీ ఒకడు. ఐతే బన్నీ ట్విట్టర్లోకి రావడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఈ మధ్యే తన తమ్ముడు అల్లు శిరీష్ బలవంతం మేరకు ట్విట్టర్లో అడుగుపెట్టాడు బన్నీ. మనోడి ఫాలోయింగ్‌కు తగ్గట్లే అతణ్ని అనుసరించేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. తన కొత్త సినిమా 'సన్నాఫ్ సత్యమూరి'లోని చల్ చలో చలో లిరిక్‌నే తొలి ట్వీట్‌గా పెట్టాడు బన్నీ. సన్నాఫ్ సత్యమూర్తి రిలీజ్ గురించి, ట్విట్టర్ అకౌంట్‌ను మేనేజ్ చేయడంలో అలవాటు పడటం గురించి ఇంకో రెండు ట్వీట్లు చేశాడు బన్నీ.
ట్విట్టర్ అకౌంట్ మేనేజ్ చేయడంలో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ.. తన అకౌంట్‌ను తానే చూసుకుంటానని అంటున్నాడు బన్నీ. ''కొందరు ట్విట్టర్ అకౌంట్ మేనేజ్ చేసే బాధ్యతను వేరే వాళ్లకు ఇచ్చేస్తుంటారు. మేనేజర్ లేదా ఏదైనా మీడియా కంపెనీ వాళ్లు ఆ పని చూస్తుంటారు. కానీ నేను అలా చేయను. నా అంతట నేనే నా అకౌంట్‌ను చూసుకుంటా. నేనే ట్వీట్లు చేస్తా. నా సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ ఇస్తా. చేతిలో ఎప్పుడూ మొబైల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఇబ్బందేం లేదు. నా అంతట నేనే ట్వీట్లు చేస్తే వాటికి క్రెడిబిలిటీ ఉంటుందని నా అభిప్రాయం'' అని చెప్పాడు బన్నీ.