పవన్ ఫ్యాన్స్ కి బన్నీ థ్యాంక్స్!!

Update: 2017-03-21 06:18 GMT
వరుస బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డీజే - దువ్వాడ జగన్నాధం. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూలో సెన్సేషన్స్ సృష్టిస్తోంది. తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచింది డీజే టీజర్.

ఇప్పుడీ టీజర్ వ్యూస్ 10మిలియన్లు.. అంటే అక్షరాలా కోటి వ్యూస్ దాటిపోయి రికార్డ్ సృష్టించేసింది. ఈ సందర్భంగా బన్నీ స్పెషల్ ట్వీట్ పెట్టాడు. 'కోటి వ్యూస్ అందించిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ ఇచ్చారు. మీ అందరి ప్రీమకు మరోసారి థ్యాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. ఈ టీజర్ కు ఇన్ని వ్యూస్ దక్కడంలో పవన్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారనే టాక్ ముందు నుంచి ఉంది. పని కట్టుకుని మరీ డిజ్ లైక్స్ కొట్టారంటారు కూడా. అందుకే డీజే టీజర్ కు లైక్స్ 1.78 లక్షలు ఉంటే.. డిజ్ లైక్స్ సంఖ్య 1.63 లక్షలు వచ్చాయి.

డిజ్ లైక్ కొట్టడానికి అయినా.. డీజే టీజర్ ను వీక్షించారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పడంలో.. పవన్ ఫ్యాన్స్ ని బన్నీ మిక్స్ చేశాడని అంటున్నారు సినీ జనాలు. మరోవైపు.. ఇప్పటికే 85శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దువ్వాడ జగన్నాధంను సమ్మర్ లో.. మే 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News