లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య ప్రస్థానం గురించి తెలిసిందే. హాస్య నటుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన సుదీర్ఘ ప్రస్థానం అభిమానులు మరువలేరు. మెగాస్టార్ చిరంజీవిని అల్లుడిని చేసుకోవడం ద్వారా ఆయన తెలివైన ప్రణాళిక అందరికీ ఎంతో స్ఫూర్తిమంతం. ఇక అల్లు రామలింగయ్య గారు నాటకాల ద్వారా పాపులరై అటుపై సినీనటుడు అయ్యారు.
అయితే నటుడు అవ్వడం కోసం ఆయన చిన్నతనంలో ఇంట్లో రూ.3 కొట్టేసి ప్రయత్నించారన్నది ఆసక్తికరం. నటన అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. అయితే తాను ఆ మూడు రూపాయలు దొంగతనం చేసిన సంగతి ఇంట్లో తెలిసిపోయి మందలించారట. ఆ రోజుతో ఆ పాడు పని వదిలేశారు. అయితే ఆ పని కూడా తనకు నటనపై ఉన్న పిచ్చితో చేసినదే.
అలాగే అల్లు రామలింగయ్య జైలుకు కూడా వెళ్లి వచ్చారు. దానికి ప్రత్యేక కారణం ఉంది. ఆరోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ముమ్మరంగా ఉంది. మహాత్మా గాంధీ పిలుపు విని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు రామలింగయ్య. ఆ ఉద్యమంలో పాల్గొన్న అందరితో పాటు రామలింగయ్య గారిని ఆంగ్ల పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు. అయితే జైల్లో ఉన్నప్పుడు ఆయనకు పుస్తకం పఠనం అలవాటైంది. ఎన్నో జీవన వికాస పుస్తకాల్ని చదివి మరింత షైన్ అయ్యారు. రామలింగయ్య గారు మహా జ్ఞాని అని కూడా చెబుతారు అందుకే. వందలాది సినిమాల్లో ఆయన అద్భుత నటన ఇప్పటికీ అభిమానుల్ని అలరిస్తూనే ఉంది. అక్టోబర్ 01 అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా మనవడు బన్ని తాతగారిని స్మరించుకున్నారు. తాత గారి ఫోటోని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆయన స్ఫురద్రూపం ఆకట్టుకుంటోంది.