మళ్లీ యథా స్థితికి చేరాడు

Update: 2018-01-06 18:46 GMT
మెగా ఫ్యామిలీలోని ఈ తరం హీరోల్లో అల్లు అర్జున్.. రామ్ చరణ్ పెద్ద స్టార్లుగా ఎదిగారు. సాయిధరమ్ తేజ్.. వరుణ్ తేజ్ కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. హీరోలుగా వారికంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుున్నారు. మార్కెట్ కూడా తెచ్చుకున్నారు. ఐతే అల్లు శిరీష్ మాత్రం ఇప్పటిదాకా ప్రత్యేకమైన గుర్తింపేమీ సాధించలేదు. కెరీర్ ఆరంభంలో పెద్ద ఫెయిల్యూర్లు.. హీరోగా యాక్సెప్టెన్స్ తెచ్చుకోకపోవడం అతడి ప్రతికూలంగా మారాయి. ఒక కొత్త హీరో వచ్చినపుడు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోయినా పర్వాలేదు కానీ.. నెగెటివిటీ ముసురుకుంటే మాత్రం కష్టం. శిరీష్ విషయంలో అదే జరిగింది. ‘గౌరవం’.. ‘కొత్త జంట’ సినిమాలతో అతను చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు.

ఇలాంటి స్థితిలో ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి విజయం సాధించింది. అందులో శిరీష్ నటన కూడా ఓకే అనిపించింది. నెగెటివిటీ పోయి న్యూట్రల్ స్టేటస్ కు వచ్చాడు. ఇక దాని మీద కెరీర్ ను ఎలా బిల్డ్ చేసుకుంటాడు.. ఇమేజ్.. ఫాలోయింగ్ ఎలా పెంచుకుంటాడు.. అని అంతా ఎదురు చూశారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన వీఐ ఆనంద్ ను తన తర్వాతి సినిమాకు దర్శకుడిగా ఎంచుకోవడంతో శిరీష్ సరైన దారిలోనే ప్రయాణిస్తున్నాడని అంతా అనుకున్నారు. ఆనంద్ దర్శకత్వంలో చేసిన ‘ఒక్క క్షణం’ జనాల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చింది కూడా. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. టాక్ పర్వాలేదనిపించినా సినిమా ఆడలేదు. శిరీష్ ఈ సినిమాకు మైనస్ అయ్యాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాకు అవసరమైన వెయిట్ శిరీష్ తీసుకురాలేకపోయాడు. నటుడిగా అంతగా మెప్పించలేకపోయాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’తో వచ్చిన పాజిటివిటీ అంతా ఈ సినిమాతో పోయింది. మళ్లీ పూర్వపు స్థితికి చేరుకున్నాడు శిరీష్. ఈ స్థితిలో అతను ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడో.. మళ్లీ ఎలా కెరీర్ బిల్డ్ చేసుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News