ప్రస్తుతం ఉన్న కొంతమంది యువ హీరోలు చాలా వరకు హిట్స్ అందుకోలేకపోతున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాగానే అందుకుంటున్నారు. ఎందుకంటే అంతా సోషల్ మీడియా మహిమ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది నటీనటులకు సోషల్ మీడియా ఎకౌంట్స్ ఉన్నాయి. సినిమాకు సంబందించిన ఎటువంటి విషయాలను అయినా వాటి ద్వారా జనాలకు తెలిసేలా చేస్తున్నారు. పైగా ప్రమోషన్స్ కి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం యువ హీరోలకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా అందుతోంది. ఆ లిస్ట్ లో ఇప్పుడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. మనోడికి ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో నెటిజన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో మాత్రం హిట్స్ అందుకోలేదు. ఇటీవల వచ్చిన ఒక్క క్షణం సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేశాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా బాగానే చేశాడు. కానీ సినిమా మాత్రం హిట్ అని అనిపించుకోలేదు. అందుకే అల్లు శిరీష్ ఇంకా ప్రమోషన్స్ కొనసాగిస్తున్నాడు.
సినిమా ఇంకా రికవరీ చేయలేదు. దీంతో కొంచెమైనా ఉపందుకోవాలని ఇటీవల హైదరాబాద్ ఫేస్ బుక్ స్టూడియో కి వెళ్లాడు. అక్కడే లైవ్ షో ద్వారా కొంచెం నెటిజన్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేశాడు. మరి ఎంతవరకు ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో చూడాలి.