అది కాన్సెప్టే.. కాపీ కాదు

Update: 2017-12-26 04:13 GMT
ఇంతకుముందు ఎంటర్ టెయిన్ మెంట్ యాంగిల్ లో కొత్తజంట.. ఫ్యామిలీ ఎమోషన్ యాంగిల్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాల్లో నటించిన హిట్లు కొట్టిన మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ ఈసారి కొత్త జోనర్ లో సినిమా చేస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో అతడు చేసిన ఒక్క క్షణం మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయొచ్చని సబ్జెక్టని ఇది తనకే కాదు.. మొత్తం ఇండస్ట్రీకే కొత్త అని అంటున్నాడు శిరీష్.

ఒకేలా ఉండే ఇద్దరి జీవితాలు (పార్లల్ లైఫ్) అనే కాన్సెప్ట్ తో ఒక్క క్షణం తెరకెక్కింది. ఇది పార్లల్ లైఫ్ అనే కొరియన్ సినిమా నుంచి ఎత్తేసిన కాన్సెప్ట్ అని విమర్శలు వచ్చాయి. దీనిపై శిరీష్ క్లారిటీ ఇస్తూ ఒక్క క్షణం పూర్తిగా ఒరిజినల్ స్టోరీ అని చెప్పుకొచ్చాడు. ‘‘పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో రాజమౌళి మగధీర సినిమా తీశాడు. అదే కాన్సెప్ట్ తో విక్రమ్ కె.కుమార్ మనం సినిమా తీశాడు. ఆ రెండు ఒకే తరహా చిత్రాలు అని అనగలమా. సినిమా అనేది డైరెక్టర్ టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. అతడు ఎంత బాగా స్టోరీని వెండితెరపై చూపించగలడు అన్నది ఇంపార్టెంట్. ఒక సరికొత్త అంశాన్ని మామూలు ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా చెప్పడం గొప్ప టాలెంట్. వి.ఐ. ఆనంద్ కు ఆ టాలెంట్ పుష్కలంగా ఉందని’’ శిరీష్ అంటున్నాడు.

‘‘ఈ రోజుల్లో ఏదో సినిమా నుంచి ప్లాట్ ఎత్తేసి మసిపూసి మాయ చేయడం కుదరదు. ఇంటర్నెట్ లో ప్రతిదీ దొరుకుతుంది. సినిమా చూశాక ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఏదో రెండు మూడు స్క్రీన్ షాట్లు పెట్టి కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. ఒక్క క్షణం కొరియన్ మూవీ పార్లల్ లైఫ్ కు కాపీ కానే కాదు’’ శిరీష్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.
Tags:    

Similar News