న‌గ్నంగా క‌నిపించేది పావుగంటా?

Update: 2019-07-16 05:48 GMT
బ‌ట్ట‌ల్లేకుండా.. న‌గ్నంగా సినిమాలు చేసిన హీరోయిన్లు ఇప్ప‌టికి కొద్దిమంది ఉన్నారు. అలాంటి వారంతా ఒక‌ట్రెండు సీన్ల‌నో.. అది కూడా క‌థ డిమాండ్ కు త‌గ్గ‌ట్లు క‌నిపిస్తుంటారు. ఇలాంటి సీన్ల నిడివి చాలా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. తాజాగా ఆమె సినిమాలో అమ‌లాపాల్ న‌గ్నంగా న‌టించ‌టం ఇప్ప‌టికే సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌చార చిత్రంలో ఆమె లుక్ ఇప్ప‌టికే సినిమా మీద ఆస‌క్తిని పెంచేసింది. ఈ వారం విడుద‌ల కానున్న మూవీలో ఆమె పాత్ర ఎలా ఉంటుంద‌న్న ఉత్కంట అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. అదే స‌మ‌యంలో న‌గ్నంగా తానెందుకు న‌టించిన విష‌యం మీద మీడియాకు ఇస్తున్న ఇంట‌ర్వ్యూల‌లో అమ‌లాపాల్ స్ప‌ష్టం చేసేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా దీనికి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించింది.  న‌గ్నంగా న‌టించ‌టం ఇబ్బందిగా అనిపించ‌లేదా అంటే మెసేజ్ ఉండే సినిమా కావ‌టం.. క‌థానుగుణంగా చూసిన‌ప్పుడు న్యూడిటీ అస్స‌లు అనిపించ‌ద‌ని ఆమె చెప్పారు. అంతేకాదు.. సినిమా మొత్తం న‌గ్నంగా క‌నిపించ‌ను. ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాలు మాత్ర‌మే న‌గ్నంగా క‌నిపిస్తానంటూ చెప్పిన మాటతో మ‌రోసారి ఈ సినిమా మీద చ‌ర్చ షురూ అయ్యేలా చేశారు.
పావుగంట‌కు పైనే నిడివిలో న‌గ్నంగా అంటే.. సినిమాలో అదెంత ప్రాధాన్య‌మున్న సంద‌ర్భ‌మో ఇట్టే అర్థ‌మైపోతుంది. పాత్ర ప‌రంగా అలా క‌నిపించాల్సి ఉంటుంద‌ని.. అందులో ఎలాంటి అస‌భ్య‌త ఉండ‌ద‌ని ఆమె స్ప‌ష్టం చేస్తున్నారు. అంతేకాదు.. మ‌ళ్లీ ఇలాంటి సినిమానే చేయ‌మంటే మాత్రం అస్స‌లు చేయ‌న‌ని తేల్చేసింది.

కొత్త‌ద‌నం కోస‌మే విభిన్నంగా ఉండే పాత్ర‌ను చేశాన‌ని.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను దూరం చేసే అవ‌కాశం లేద‌ని న‌మ్మ‌కంగా చెప్పింది. ఏమైనా.. సినిమా నిడివిలో పావు గంట‌కు పైనే న్యూడ్ గా క‌నిపించే పాత్ర చేయ‌టానికి మాత్రం చాలా గ‌ట్స్ కావాలి. అది త‌న‌లో ఎంత ఉంద‌న్న విష‌యాన్ని అమ‌లాపాల్ ఆమెతో చెప్పేసింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News