రెండు భాషల్లో రిలీజ్ కానున్న ఒక సినిమా టీజర్ కు గతంలో ఎప్పుడూ రానన్ని లైక్స్ ఈ టీజర్ కు రావటం ఒక ఎత్తు అయితే.. అలాంటి సీన్ల కోసం నటి అమలాపాల్ పడిన కష్టం గురించి విన్నవారంతా షాక్ తింటున్నారు. తమిళంలో ఆడైగా.. తెలుగులో ఆమెగా వస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదల పెను సంచలనాన్ని రేపటమేకాదు.. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగేలా చేశాయి.
ఒక మహిళ స్వేచ్ఛ.. సంప్రదాయాల గురించి చర్చించే ఈ సినిమాలో నగ్న సన్నివేశాలు చాలానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇవన్నీ కథకు అవసరమయ్యేలా ఉండటం.. నగ్నత్వంలో జగుప్సాకరంగా కాకుండా ఆర్టిస్టిక్ గా తీసిన వైనం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.
దీనావస్థలో ఉండే మహిళ వేదనను కళ్లకు కట్టేలా చూపించిన టీజర్ సంచలనంగా మారింది. ఇక.. ఈ సినిమా కోసం అమలాపాల్ ఏకంగా 20 రోజుల పాటు నగ్నంగా నటించిన విషయం బయటకు వచ్చింది. ఆమె ధైర్యాన్ని.. సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇదంతా సాధారణ విషయం కాదని.. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం అవసరమని చెబుతున్నారు. ఈ సినిమాకు తాజాగా ఏ సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది.
మోటార్ బైక్ నడపటం.. విలన్లతో ఫైట్ చేయటం.. అదే సమయంలో బేలగా.. దీనావస్థలో ఉండటం.. లాంటి వైవిధ్యమైన సీన్లు చేసిన అమలాపాల్ కు ఈ చిత్రం కచ్ఛితంగా ఆమెకు ప్రత్యేకమని చెప్పక తప్పదు.