బెయిల్ దక్కించుకున్న అమలాపాల్

Update: 2018-01-17 18:36 GMT
సౌత్ హాట్ బ్యూటీ అమలాపాల్ అవకాశాలు ఎన్ని అందుకుంటున్నా కూడా వివాదాలను కూడా అదే స్థాయిలో అందుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్ లో అమ్మడి నెమ్మది తనాన్ని చూసి వివాదాల జోలికి వెళ్లే అమ్మాయి కాదని అనుకున్నారు. కానీ కెరీర్ మొదట్లోనే దర్శకుడితో డేటింగ్ చేసి పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఆ తరువాత కొన్నేళ్లకే చిన్న కారణాల వల్ల విడాకుల వరకు వచ్చి పెళ్లి బంధానికి కొన్నేళ్లకే స్వస్తి చెప్పింది.

ఆ తరువాత వరుసగా అవకాశాలు దక్కించుకొని అమల హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఆ మధ్య సిగరెట్ తాగుతూ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అసలు విషయానికి వస్తే గతంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే. 2017లో రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేసిన అమలాపాల్ తప్పుడు చిరునామాను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుందని తద్వారా రూ. 20 లక్షల టాక్స్ ను ఎగ్గొట్టిందని కేరళలో పోలీస్ కేసు నమోదైంది.

అయితే ముందుగానే అమలా హై కోర్టులో బెయిల్ కోరగా రీసెంట్ గా కోర్టు లక్ష్మ రూపాయల పూచీకుత్తు తో ఆమెకు బెయిల్ ఇచ్చింది. అంతే కాకుండా పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం ఆమెను పోలీసులకు లొంగిపోవాలని తెలుపగా అమలా లొంగిపోయింది. అవసరం అయినపుడు విచారణకు హాజరుకావాలని మందలించింది.
Tags:    

Similar News