నా విడాకులకు ఆ హీరోకు సంబంధం లేదు

Update: 2020-02-19 00:30 GMT
హాట్‌ హీరోయిన్‌ అమలా పాల్‌ విడాకులు అయ్యి చాలా కాలం అయినా కూడా ఇంకా అదే విషయమై మీడియాలో నానుతూనే ఉంది. అమలా పాల్‌ ఆమె భర్త విజయ్‌ ల మద్య గొడవ రావడానికి కారణం ఒక తమిళ హీరో అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ తమిళ హీరో ఎవరో విజయ్‌ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. ధనుష్‌ వల్లే తన కొడుకు అతడి భార్య విడిపోయారు అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలనుకున్న ఆమెతో ధనుష్‌ మళ్లీ నటింపజేయడం వల్లే వారిద్దరి మద్య గొడవ ప్రారంభం అయ్యింది.

సినిమా వల్ల ప్రారంభం అయిన గొడవలు విడాకుల వరకు దారి తీసింది అంటూ ఆయన పేర్కొన్నాడు. విజయ్‌.. అమలా పాల్‌ విడాకులకు ధనుష్‌ కారణం అంటూ ఆయన చెప్పడంతో మరోసారి ఈ మాజీ కపుల్‌ విడాకుల విషయం చాలా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంను ధనుష్‌ మరియు అమలా పాల్‌ ల వద్దకు తీసుకు వెళ్లేందుకు జర్నలిస్ట్‌ లు ప్రయత్నిస్తున్నారు. ధనుష్‌ అందుబాటులోకి రాలేదు. అమలా పాల్‌ ను ఇదే విషయమై స్పందించాల్సిందిగా కోరగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీ విడాకులకు ధనుష్‌ కారణం అంటూ విజయ్‌ తండ్రి చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించగా ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని గురించి ఇంకా ఎందుకు గుర్తు చేస్తూ మాట్లాడివ్వాలని చూస్తారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. భార్య భర్తల విడాకులకు మరెవ్వరో కారణం అవ్వరు అంది. అంటే తమ విడాకులకు ధనుష్‌ తో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

మా ఇద్దరి కారణంగానే మేము ఇద్దరం విడిపోయాం తప్ప మరెవ్వరి కారణంగానో మేము విడిపోలేదు. అసు భార్య భర్తలు పరాయి వ్యక్తి వల్ల విడిపోవడం అనేది ఉండదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక రెండవ పెళ్లి గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదని.. చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చెప్తానని... ప్రేమ వివాహమా లేదంటే పెద్దల కుదిర్చినదా అనేది కూడా నేను ఇంకా నిర్ణయించుకోలేదు అంది.
Tags:    

Similar News