కూతురు నిశ్చితార్థంలో అమీర్ తాత అస‌లు రంగు ఇదీ

Update: 2022-11-19 07:36 GMT
ఇంకా నూనూగు మీసాలు.. పొట్టి జుట్టుతో ఇస్మార్ట్ గా క‌నిపించే అమీర్ ఖాన్ వ‌య‌సు ఎంతో క‌నిపెట్ట‌గ‌ల‌రా?.. ఠ‌కీమ‌ని దీనికి స‌మాధానం చెప్ప‌గ‌లిగేది చాలా కొద్దిమంది సన్నిహితులు మాత్ర‌మే. నిజానికి ఖాన్ ల త్ర‌యంలో మిస్ట‌ర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు ఉన్న‌ అమీర్ ఖాన్ వ‌య‌సు ఎంత‌? అన్న‌ది అభిమానుల‌కు ఇప్ప‌టికీ తెలీదు.

మిస్ట‌ర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇప్ప‌టికీ టీనేజీ నాయిక‌ల స‌ర‌స‌న న‌టించేస్తూ.. దంగ‌ల్ స‌హ‌న‌టి అయిన పాతిక ప్రాయం ఫాతిమా స‌నాషేక్ తో స‌హ‌జీవ‌నం చేస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డు ఇంకా పూల‌రంగ‌డిలా బాలీవుడ్ లో హ‌ల్ చల్ చేస్తున్న వ్య‌వ‌హారం చూస్తే అస‌లు ఆయ‌న‌కు వ‌య‌సు అయిపోయింద‌ని ఎవ‌రూ అనుకోలేరు. కానీ అమీర్ ఖాన్ ఏజ్ 57.. అంటే ష‌ష్ఠిపూర్తికి మూడేళ్లు పెండింగ్.

ష‌ష్ఠిపూర్తి హీరోకి టీనేజీ దాటిన కూతురు ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గ‌త కొన్నేళ్లుగా జిమ్ కోచ్ నుపుర్ శిఖరేతో ప్రేమాయ‌ణం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట స‌హ‌జీవ‌నం గురించి ఇటీవ‌ల మీడియాలో చాలా చ‌ర్చ సాగింది. తండ్రి అమీర్ ఖాన్ బిజీ షెడ్యూళ్ల‌తో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వ‌చ్చిన క్ర‌మంలో ఇరాఖాన్ త‌న జీవితంలో ఎక్కువ భాగం స్కూల్ కాలేజ్ హాస్ట‌ళ్ల‌లోనే గ‌డిపింది. అదే క్ర‌మంలో తాను బ‌రువు త‌గ్గే వ్యాయామాల కోసం త‌న తండ్రి ఫిట్ నెస్ శిక్ష‌కుడు.. యువ‌కుడు అయిన నూపుర్ శిఖారేని ఎంపిక చేసుకుంది. ఆ త‌ర్వాత అత‌డితో సాన్నిహిత్యం ప్రేమ‌కు దారి తీసింది.

ఈ జంట త‌మ ప్రేమ‌ను ఏనాడూ దాచ‌లేదు. బ‌హిరంగంగా ఒక‌రిపై ఒక‌రు త‌మ మ‌న‌సును ప్ర‌క‌టించారు. క‌లిసి జంట‌గా దిగిన ఫోటోలను అంత‌ర్జాలంలో షేర్ చేసారు. ఎట్ట‌కేల‌కు ఈ జంట పెళ్లితో ఓ ఇంటి వాళ్లు కాబోతున్నార‌న్న శుభ‌వార్త అందింది. అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ నిశ్చితార్థం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నూపుర్ శిఖరేతో ఇరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలో అమీర్ ఖాన్ స‌రికొత్త లుక్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నిజానికి నియాన్ కాంతుల వెలుగు జిలుగుల న‌డుమ‌ ఇంత‌కాలంగా మేక‌ప్ కాస్మోటిక్స్ ప్యాకేజీల‌తో క‌వ‌ర‌ప్ చేసిన ఏజ్ గుట్టు కాస్తా ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. అమీర్ ఖాన్ ఒరిజిన‌ల్ ఏజ్ ఏంటో ఈ నిశ్చితార్థంలో తెలిసొచ్చింది. పండిన త‌ల వెంట్రుక‌లు మీస‌క‌ట్టు గ‌డ్డంతో అత‌డు సిస‌లైన తాత‌య్య‌లా క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా వాళ్లు ఇంత  పెద్ద మోసం చేస్తున్నారా? అంటూ అత‌డి రూపం చూశాక‌.. చాలా మంది నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు.

ఇరా-నూపుర్ జంట నిశ్చితార్థ వేదిక‌ ఫుల్ హౌస్ గా క‌నిపించింద‌ని ముంబై మీడియా ఇప్ప‌టికే క‌థ‌నాల్లో వెల్ల‌డించింది. కాబోయే భర్త నుపుర్ శిఖరేతో చేయి చేయి కలిపి నడుచుకుంటూ వెళుతున్న ఇరా ఖాన్ రెడ్ హార్ట్ గౌను లో దేవ‌త‌లా మెరిసిపోయింద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ఈ వేడుక‌కు హాజరైన అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ త‌న కజిన్ మన్సూర్ ఖాన్ తో కలిసి కనిపించారు. అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా - కిరణ్ రావు కూడా జిమ్ కోచ్ నూపూర్ తల్లి జీనత్ హుస్సేన్ తో క‌లిసి కనిపించారు. ఈ వేదిక వ‌ద్ద అమీర్ ఖాన్ తన సిల్వర్ ఫాక్స్ లుక్ లో లేత గోధుమరంగు కుర్తా కాంబినేష‌న్ ధోతీతో ఓల్డేజీ సోగ్గాడిలా క‌నిపించాడు. అతను బంధువు మన్సూర్ ఖాన్ తో చేయి చేయి క‌లిపి డ్యాన్సులు చేస్తూ కెమెరాల‌కు సంతోషంగా పోజులిచ్చాడు.

ఇరా ఖాన్ గురించి వివ‌రంలోకి వెళితే.. ఆమె అమీర్ ఖాన్ మాజీ భార్య- సినీ నిర్మాత రీనా దత్తా కుమార్తె. త‌న‌కు జునైద్ ఖాన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. నూపూర్ తో రెండేళ్లుగా ఇరా డేటింగ్ చేస్తోంది. అతను ఆమెకు ఫిట్‌నెస్ ట్రైనర్. గ‌త‌ సెప్టెంబరులో నుపుర్ ఒక అథ్లెటిక్ ఈవెంట్ లో ఇరాకు ఉంగరంతో ప్రపోజ్ చేస్తూ మోకాలిపై కూచుని క‌నిపించిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసాడు. ఆశ్చర్యకరమైన త‌న‌ ప్రతిపాదన కు సంబంధించిన‌ ఒక క్లిప్ ను పంచుకుని త‌న ప్రేమ‌ను బ‌హిరంగం చేసాడు. అనంత‌రం మీడియాలో విస్త్ర‌తంగా దీనిపై క‌థ‌నాలొచ్చాయి.

రెండేళ్లుగా ఈ ప్రేమ‌జంట అత్యంత‌ సన్నిహితంగా ఉన్నారు. అనుబంధాన్ని పంచుకున్నారు. రెగ్యుల‌ర్ గా రెస్టారెంట్లు విదేశీ వెకేష‌న్ల పేరుతో ర‌క‌ర‌కాల‌ ప్రదేశాలను సందర్శించారు. ఈ జంట‌ ఒకరి కుటుంబంతో ఇంకొక‌రు గ‌డిపారు. ఇటీవ‌ల‌ దీపావళిని నూపూర్ తల్లితో పాటు మరికొందరితో కలిసి జరుపుకుంది ఇరా. త‌న అంద‌మైన‌ జీవిత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులకు సోష‌ల్ మీడియాల్లో ఇరా షేర్ చేస్తోంది. త‌న జీవితంలో విషాద గ‌తాన్ని కూడా ఎంతో ఆవేద‌న‌తో క‌థ‌నం రూపంలో రాసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇంత‌కుముందు న‌టి కం నిర్మాత‌ సారిక నిర్మించిన నాటకం(స్టేజీ డ్రామా)తో ఇరా ఖాన్ దర్శకురాలిగా పరిచయం అయింది.  `యూరిపెడెస్ మెడియా`  నుండి స్వీకరించబడిన డ్రామా ఇది. ఇందులో హాజెల్ కీచ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించింది. ఇరా భ‌విష్య‌త్ లో ద‌ర్శ‌కురాలిగా కొన‌సాగే ఛాన్సుందని క‌థ‌నాలొచ్చాయి. మరోవైపు అమీర్ చివరిగా లాల్ సింగ్ చద్దా చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా ఫ‌లితం డిజాస్ట‌రైన సంగ‌తి తెలిసిందే. కాజోల్‌ నటిస్తున్న సలామ్‌ వెంకీ చిత్రంలో అమీర్ అతిధి పాత్రలో నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News