బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడ్డారు ..ఈ విషయాన్ని ఆయనే అధికారకంగా తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకి తెలియ జేశారు . నాకు కరోనా పాజిటివ్ వచ్చింది . నన్ను హాస్పిటల్ కి తరలించారు.. కుటుంబ సభ్యులు, స్టాఫ్ పరిక్షలు చేయించుకున్నారు ఫలితాలు ఇంకా రాలేదు. గత పది రోజుల గా నన్ను కలిసిన ప్రతి ఒక్కరు, పరీక్షలు చేయించుకోండి అని చెప్పారు. అభిమానులు ఎవరు కంగారు పడకండి జాగ్రత్త గా ఉండండి ఈ క్రైసిస్ టైం లో అని చెప్పారు . కాగా ఆయన ముంబై లోని నానావతి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు . కరోనా ఎవరికన్నా వస్తుంది అనడం లో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు . జాగ్రత్త గా ఉండటం ఒక్కటే మన చేతుల్లో ఉంది .