ఫోటో స్టోరి: ఈ భంగిమ చూశారా.. ఇక అంతేలే!

Update: 2022-04-02 10:33 GMT
అమైరా ద‌స్తూర్ .. ప‌రిచ‌యం అవస‌రం లేదు. సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండే యూత్ కి చాలా చేరువ‌గా ఉందీ భామ‌. మంజుల ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న క‌థానాయికగా న‌టించిన అమైరా ద‌స్తూర్ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో కొన్ని అవ‌కాశాలు అందుకుంది. అక్క‌డ‌ ఇమ్రాన్ హ‌స్మి..  ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది ఈ భామ‌. ప్ర‌స్తుతం ఓ మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఊడి ఊది ఉజికానుమ్ ..కాధ‌లై తేడి నిత్య నంద అనే రెండు త‌మిళ చిత్రాల్లో న‌టిస్తోంది. పిల్ ఫ‌ర్ సింగ్ అనే హిందీ చిత్రంలోనూ నాయిక‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే భ‌గీరా అనే చిత్రంలోనూ అవ‌కాశం అందుకుంది. ఈ సినిమాలో ప్ర‌భుదేవా ఐదు గెట‌ప్పుల‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నారు. ఇందులో అమీరా దస్తూర్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుందిట‌. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన భ‌గీరా టీజ‌ర్ ఆస‌క్తిని పెంచింది.

అమైరా ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఈ బ్యూటీ పోస్టులు అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. ఇటీవ‌లే మాల్దీవుల విహారం నుంచి వేడెక్కించే ఫోటోషూట్ ల‌ను షేర్ చేసిన ఈ బ్యూటీ కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయింది.

తాజాగా షేర్ చేసిన ఓ బికినీ ఫోటోగ్రాఫ్ ఇంత‌లోనే వైర‌ల్ గా మారింది. వాటర్ బేబీ అమైరా తన మాల్దీవుల సెలవుల్లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.  ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో వ‌రుస ఫోటోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. స‌ముద్రంలో బోట్ షికార్ వెళుతూ ఇదిగో ఇలా అదిరిపోయే భంగిమ‌లో క‌నిపించింది. అమైరా ఫోటోషూట్ హీటెక్కిస్తోంది.  వారాంతాల్లో ప్రత్యేకంగా శనివారాలు గడపడానికి మాత్రమే మార్గం ఉంది.. అంటూ మ‌రోమారు ప్రూవ్ చేసింది. సముద్రంలో.. ప‌డ‌వ‌ క‌దుపుతూ.. ఉంటే ముఖం మీద సూర్యుని కాంతిని ప్ర‌స‌రిస్తుంటే దానిని ఆస్వాధించాలి! లివ్ ఇన్ ది స‌న్ షైన్.. స్విమ్ ఇన్ ది సీ.. డ్రింక్ ది వైల్డ్ ఎయిర్.. అంటూ రాల్ఫ్ వాల్డోమెర్స‌న్.. క్యాప్ష‌న్ ని ఇచ్చింది. సినిమాల్లేక‌పోయినా ఇటీవ‌ల వెకేష‌న్స్ కి మాత్రం కొద‌వే లేదు ఈ అమ్మ‌డికి. ఒంట‌రి దీవుల సెలబ్రేష‌న్ ని ఆస్వాధిస్తోంది. అలాగే క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తూ ఆర్జిస్తోంది. తాజా ఫోటోషూట్ చూస్తుంటే ల‌క్స్ ప్ర‌మోష‌నల్ యాడ్ షూట్ కోసం ఈ బ్యూటీ మాల్దీవుల‌కు వెళ్లింద‌ని అర్థమ‌వుతోంది. LUX* South Ari Atoll మాల్దీవుల్లోనే ఫేమస్ రిసార్ట్. బ్లూవాట‌ర్స్ న‌డుమ సెల‌బ్రేష‌న్ పీక్స్ కి చేర్చే సౌక‌ర్యాలు ఇక్క‌డ ఉన్నాయి.
Tags:    

Similar News