భారీ చిత్రాలకు ఈ మధ్య ఎడిషనల్ షోస్ వేయడం అనే కల్చర్ కనిపిస్తోంది. ఆయా సినిమాల నిర్మాతలు తాము మూవీపై ఎక్కువ ఖర్చు వెచ్చించామని.. దీన్ని రికవర్ చేసుకునేందుకు రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు టికెట్ పై అదనంగా వసూలు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓసారి ఇలా పర్మిషన్ రాకపోతే థియేటర్ ఓనర్లు హైకోర్టుకు వెళ్లడంతో.. నచ్చినంత రేటు వసూలు చేసుకుని.. అందుకు తగినట్లుగా పన్ను చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఆ తర్వాత నుంచి అడిగిన వెంటనే పర్మిషన్స్ బాగానే వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న మూవీ భరత్ అనే నేను ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఈ చిత్రానికి స్పెషల్ షో వేసుకునేందుకు పర్మిషన్ వచ్చింది. ఉదయం 5 నుంచి 10 గంటల మధ్య థియేటర్లను తెరచి ఉంచవచ్చని.. ఇదే సమయంలో అదనంగా ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నామని.. కానీ ఈ అనుమతి ఒక షోకు మాత్రమే పరిమితం అంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
థియేటర్లకు ఎలాగూ టికెట్ రేట్ల విషయంలో స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు అడిషనల్ షోకు కూడా పర్మిషన్ వచ్చింది. పైగా సినిమాకు విపరీతమైన బజ్ ఉంది. ఇలాంటి సమయంలో వస్తున్న భరత్ అనే నేను.. వసూళ్ల రికార్డులను సరి చేసుకునేందుకు అన్ని రకాలు గాను రంగం సిద్ధం అయిపోతోంది.