పటాస్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి కళ్యాణ్ రామ్ కు సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్ ఇచ్చి అందరి దృష్టిన ఆకర్షించిన దర్శకుడు అనీల్ రావిపూడి. పటాస్ మొదలుకుని ఇప్పటి వరకు అనీల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా కూడా సక్సెస్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఎఫ్ 3 సినిమా ఆ తర్వాత చేయబోతున్న బాలయ్య సినిమాలు కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
అనీల్ రావిపూడి ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించేందుకు చాలా కష్టపడ్డాడట. మొదటి సినిమా ఎక్స్ పీరియన్స్ ను దర్శకుడు అనీల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెళ్లడించాడు. ముఖ్యంగా అనీల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. షూటింగ్ ముగిసే సమయంకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఆఫీస్ కు రెగ్యులర్ గా ఎన్టీఆర్ గారు వచ్చే వారు.
ఆ సమయంలో ఆయన చాలా సరదాగా మాట్లాడేవారు. ఎక్కువగా నాపై జోకులు వేస్తూ.. నన్ను ర్యాగింగ్ చేసినట్లుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన చేసిన ర్యాగింగ్ ను నేను ఎప్పటికి మర్చిపోలేను. నాపై వేసిన పంచ్ లు మరియు ఆయన నాతో షేర్ చేసుకున్న విషయాలను నేను ఎప్పటికి మర్చిపోలేను అంటూ అనీల్ రావిపూడి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. నన్ను ప్రతి చిన్న విషయంలో కూడా సరదాగా అల్లరి చేయడం.. నాపై చిన్న విషయంలో కూడా జోకులు వేయడం చేసేవాడు.
ఆ సమయంలో ఎన్టీఆర్ తో జరిగిన సంఘటనలు ఎప్పటికి మర్చిపోలేనివి అన్నాడు. ఆయన తో వర్క్ చేయడం కోసం ఆ సమయంలోనే ప్రయత్నించాను అన్నాడు. తప్పకుండా వీరి కాంబోలో సినిమా వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో పటాస్ సక్సెస్ అయిన వెంటనే ఎన్టీఆర్ మరియు అనీల్ రావిపూడి కాంబో మూవీ అంటూ ప్రచారం మొదలు అయ్యింది. కాని ఇప్పటికి కూడా వీరి కాంబో మూవీ రాలేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా లో రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఇక అనీల్ రావిపూడి విషయానికి వస్తే ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అనీల్ రావిపూడి ఇప్పటి వరకు అపజయం ఎరుగలేదు. కనుక ఖచ్చితంగా ముందు ముందు ఆయన నుండి రాబోతున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.