విక్టరీ వెంకటేష్ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది కదా.. ఇక అంజలి టాప్ రేంజికి చేరిపోయినట్లే అని అనుకున్నారు చాలామంది. కానీ కాలం కలిసి రాలేదు. అంజలి రేంజి ఏమాత్రం పెరగలేదు. చిన్న సినిమా 'గీతాంజలి'లో లీడ్ రోల్ చేసి సక్సెస్ కొట్టింది కానీ.. పెద్ద సినిమాల్లో మాత్రం మళ్లీ ఇంకో ఛాన్స్ లేదు అంజలికి. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన కోలీవుడ్‌కే వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటోంది అంజలి. అశోక్ దర్శకత్వంలో చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ తప్ప అంజలి చేతిలో ఇంకో సినిమా ఏదీ లేకపోవడంతో టాలీవుడ్‌లో ఇంతకుమించి అంజలి ఎదిగే ఛాన్స్ లేదని ఫిక్సయిపోయారు జనాలు.
ఐతే ఆశ్చర్యకరంగా బాలయ్య 'డిక్టేటర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది అంజలి. ఇందులో ఇద్దరు హీరోయిన్లని.. ఓ హీరోయిన్‌గా అంజలిని ఖరారు చేశామని ప్రెస్ నోట్‌లో ప్రస్తావించారు. అంజలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఆమెకు బంపరాఫరే అని చెప్పాలి. ఇంతకుముందు అంజలికి 'గీతాంజలి' లాంటి మరపురాని సినిమాను అందించిన కోన వెంకటే ఆమెకు బాలయ్య సినిమాలోనూ ఛాన్స్ ఇప్పించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆయనే కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చుతున్న సంగతి తెలిసిందే. 'గీతాంజలి' సమయంలో అంజలికి మంచి కెరీర్ సెట్ చేస్తున్నట్లు కనిపించాడు కానీ.. ఆ తర్వాత ఆమెను పట్టించుకోనట్లు వ్యవహరించాడు కోన. కానీ ఇప్పుడు బాలయ్య లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం ఇప్పించి అంజలి కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించాడు కోన. ఒక టాలెంటెడ్ తెలుగమ్మాయిని ఇలా పైకి తెస్తున్న కోన అభినందనీయుడే.