టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను అంతర్జాతీయ స్థాయి పురష్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అయిన విషయం తెల్సిందే.
ఆస్కార్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులు మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సొంతం అవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా మరో అంతర్జాతీయ స్థాయి పురష్కారం అయిన సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ వారు ఇచ్చే పురస్కారంను సొంతం చేసుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ అవార్డును సొంతం చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ ఇప్పటి వరకు ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఈ అత్యున్నత పురష్కారంను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్‌ఆర్ సినిమాకు సదరు సొసైటీ వారు అవార్డును ఇవ్వడం పట్ల తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి ఈ సినిమాను ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందించిన విషయం తెల్సిందే. అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ కథలను అద్భుతమైన ఎమోషన్స్ తో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందించడం జరిగింది.
హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలకు ఇప్పుడు ఈ సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు దక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.