సౌత్ నుంచి దూసుకొస్తున్న మ‌రో పాన్ ఇండియా స్టార్

Update: 2022-05-23 02:40 GMT
యాక్షన్ హీరోయిజానికి బెంచ్ మార్క్ వేసాడు హీరో విశాల్. తమిళంలో స్థిర‌ప‌డిన తెలుగోడిగా అత‌డికి గుర్తింపు ఉంది. ప్ర‌తిసారీ యాక్ష‌న్ సినిమాతో వ‌చ్చి త‌మిళం- తెలుగులో మంచి మార్కులు వేయించుకుంటాడు. ప్రస్తుతం ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ `ల‌త్తి`లో నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

`ల‌త్తి`తో వార్ లోకి వ‌స్తున్నాన‌ని విశాల్ ప్ర‌క‌టించ‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. స్వాతంత్య్ర‌ దినోత్సవ వారంలో ఆగస్ట్ 12న తన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు విశాల్ ప్రకటించారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న `ల‌త్తి` చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తోంది.

అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశాల్ తీవ్రంగా దెబ్బ‌లు తిని గాయాల‌తోనే నవ్వుతూ కనిపించాడు. అత‌డి ముఖం పెద‌వులు చిట్లిపోయేంత‌గా కొట్టినా అత‌డిలో క‌సి అలానే క‌నిపిస్తోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఛాలెంజింగ్ రోల్ తో మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయ‌మ‌ని అర్త‌మ‌వుతోంది. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత స్వరకర్త.

నిజానికి విశాల్ చిత్రంతో పాటు అఖిల్ స్పై థ్రిల్లర్ ఏజెంట్ .. నితిన్ న‌టించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ `మాచర్ల నియోజకవర్గం` కూడా ఆగస్టు 12న విడుదల కానున్నాయి. అంటే సిస‌లైన ముక్కోణ‌పు పోటీలో ల‌త్తి స‌త్తా చాటాల్సి ఉంటుంది. విశాల్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఇది పాన్ ఇండియా కంటెంట్ తో మెప్పిస్తుందేమో చూడాలి.

హిందీ మార్కెట్ పైనా దృష్టి

ఇన్నాళ్లు ద‌క్షిణాది క‌థ వేరు.. ఇక‌పై క‌థ వేరే. ఇప్పుడు సౌత్ ప‌రిశ్ర‌మ‌లు హిందీ మార్కెట్ పై క‌న్నేశాయి. అక్క‌డ వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు న‌మోద‌వుతుంటే అంద‌రు హీరోల్లోనూ ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది.

ఎవ‌రికి వారు ఇక‌పై పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్లాల‌న్న ప‌ట్టుద‌ల‌ను క‌న‌బ‌రుస్తున్నారు. ఇక ఇదే కోవ‌లో విశాల్ కూడా హిందీ మార్కెట్ పై దృష్టి సారించాడ‌ని తెలుస్తోంది. లత్తీని ఉత్త‌రాదినా పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News