సింగం 3 త‌ర్వాత బాహుబ‌లి షూట్‌

Update: 2015-12-04 06:14 GMT
స్వీటీ అనుష్క ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సైజ్ జీరో బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అనుష్క చ‌క్క‌గా న‌టించింద‌న్న పేరైతే వ‌చ్చింది కానీ, నిర్మాత‌ల‌కు పెట్టుబ‌డులు తిరిగి రాలేదు. ఇక ఆ హాంగోవ‌ర్ నుంచి బైటికొచ్చి త‌దుప‌రి షూటింగుల‌పై కాన్‌స‌న్‌ట్రేట్ చేస్తోంది స్వీటీ. ఇప్ప‌టికే వైజాగ్‌లో సింగం 3 షూటింగ్ జ‌రుగుతోంది. అయితే ఇంత‌వ‌ర‌కూ స్వీటీ పోర్ష‌న్‌కి సంబంధించిన డీటెయిల్స్ తెలియ‌లేదు.

ఈ డిసెంబ‌ర్‌లో బాహుబ‌లి సెట్స్‌కెళ్లాల్సి ఉన్నా జ‌న‌వ‌రి లో కానీ రెగ్యుల‌ర్ షూటింగుకి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంది. ఇటీవ‌లే ఎం.ఎం.కీర‌వాణి సార‌థ్యంలో సైలెంటుగా సాంగ్ రికార్డింగ్స్ ప్రారంభించేశారు. అధికారికంగా షూట్ మాత్రం జ‌న‌వ‌రిలోనే అని యూనిట్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. అంటే ఈనెల రోజుల్లో అనుష్క త‌న కాల్షీట్ల‌ను సింగం 3 కోసం కేటాయించినా ఎవ‌రికీ న‌ష్టం లేదు. పైగా జ‌క్క‌న్న నుంచి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. అనుష్క ఈ  ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ సింగం 3 కి ప‌నిచేయాల్సిందిగా సూచించాడు రాజ‌మౌళి. అందుకే స్వీటీ కూడా రెడీ అవుతోంది.

అలాగే నాగార్జున‌-కార్తీ హీరోలుగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో పివిపి నిర్మిస్తున్న ఊపిరి సినిమాలో కామియో షూటింగులోనూ స్వీటీ పాల్గొనే అవ‌కాశం ఉంది. బాహుబ‌లి ఆల‌స్యం ఈ రెండు సినిమాల్లో త‌న రోల్ పూర్తి చేసుకోవ‌డానికి సాయ‌మ‌వుతోంద‌న్న‌మాట‌! అదీ సంగ‌తి.
Tags:    

Similar News