అంబానీల విలాసవంతమైన గృహం `అంటిల్లా` గురించి వర్ణించాలంటే దాదాపు 200 పేజీల పుస్తకం రాయాలని అంటారు. ముంబైలోని ఆకాశహార్మ్యాలను తలదన్నే `అంటిల్లా` నగరానికే తలమానికం. ఇది కేవలం ముంబైకే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన భవంతి. ఈ భవంతిలోని పై అంతస్తుల్లో రెండు అంతస్తులు పూర్తిగా కార్ల పార్కింగ్ కే కేటాయించారు. అలాంటి చోట కార్ ని పార్క్ చేయాలంటే బాలీవుడ్ నుంచి ఏ స్టార్ కి అనుమతి ఉంటుంది? అంటే ఒకే ఒక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈవెంట్లు జరిగేప్పుడు సెలబ్రిటీలంతా అంబానీల అంటిల్లాను చుట్టుముడతారు. ది గ్రేట్ బిజినెస్ మేన్ కంట పడాలని మెప్పు పొందాలని ఆరాటపడతారు. కానీ అవకాశం అందరికీ రాదు. అతికొద్ది మందికి మాత్రమే దగ్గరగా చేరువయ్యే ఛాన్సుంటుంది. ఆ ర్యాపో ఒకరిద్దరికి మాత్రమే అరుదుగా ఉంటుంది. అలాంటి ఒకరిగా ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ పేరు వినిపిస్తోంది. నిజానికి అంబానీ వారసుడు అనంత్ అంబానీ - ప్రముఖ ఫార్మా కంపెనీ సీఈవో కుమార్తె రాధిక వ్యాపారి నిశ్చితార్థ వేడుక అనంతరం ప్రత్యేక అతిథి అయిన షారూఖ్ తన కారును యాంటిల్లా హౌస్ లోకి పోనిచ్చేందుకు అనుమతి లభించింది. ఇతర స్టార్ల కార్లు ఏవీ అంటిల్లాలో ప్రవేశించేందుకు అనుమతి లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ముఖేష్- అనీల్ అంబానీ బ్రదర్స్ తో ఖాన్ ల త్రయం ఎంతో క్లోజ్ గా ఉంటారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ సైతం ఎంతో సన్నిహితుడు.. కానీ నేటి సందడిలో అమీర్ జాడ కనిపించలేదు. పైగా కింగ్ ఖాన్ షారూఖ్ హడావుడే అక్కడ ఎక్కువగా కనిపించిందని స్పాట్ లో పరిశీలకులు చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ అంటిల్లాలోకి వెళ్లినా కానీ మరీ అంత హంగామా కనిపించలేదు.
మరింతగా వివరాల్లోకి వెళితే.. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల గ్రాండ్ ఎంగేజ్ మెంట్ వేడుక నిన్నటి నుండి ముంబై నగరంలో చర్చనీయాంశమైంది. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫోటోలు వీడియోలు వీక్షిస్తే సెలబ్రిటీల ప్రత్యేక ఆసక్తి... శ్రద్ధ బయటపడ్డాయి. ఒక మహాసామ్రాజ్యంలో చక్రవర్తి చుట్టూ నిలబడే సామంత రాజుల్లా బాలీవుడ్ స్టార్లు ఒద్దికగా నిలబడి కనిపించడం ఒక ప్రత్యేకమైన స్టంట్. నిజానికి ఇలాంటి అరుదైన దృశ్యాలు అభిమానుల దృష్టిని అధికంగా ఆకర్షిస్తాయి. తాజా సన్నివేశం అలానే కంటపడింది.
ఈ గ్రాండ్ వేడుకకు సినీరాజకీయ రంగాల ప్రముఖులతో పాటు అన్నిరకాల పరిశ్రమల నుండి బిగ్ షాట్స్ హాజరయ్యారు. జాన్వీ కపూర్- రణబీర్ కపూర్- అలియా భట్- సల్మాన్ ఖాన్ ఈ వేడుకలో సినీపరిశ్రమ ప్రతినిధులుగా ప్రత్యేకంగా కనిపించారు. కానీ షారూఖ్ ఖాన్ కార్ మాత్రమే అంటిల్లాలోని పార్కింగ్ స్పేస్ లోకి అనుమతించబడింది. ఇంటర్నెట్ లో ఫోటోలు వీడియోలను పరిశీలిస్తే..సెలబ్రిటీలంతా భవనం లోపలికి నడుచుకుంటూ వెళుతూ కనిపించారు. అయితే లోపలికి అనుమతి పొందిన ఒకే ఒక్క ఒక కారు మాత్రం సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ది అని స్పాట్ బోయ్ వెల్లడించారు.
అందుకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. చాలామంది స్టార్లు లోనికి వెళుతున్నా కానీ ముఖం కనిపించని ఒకే ఒక్క నటుడు సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ అని కూడా టాక్ వినిపించింది. అయితే అతడి కార్ ను అభిమానులు గుర్తు పట్టేశారు. షారూఖ్ ప్రస్తుతం `జవాన్` సినిమా షూటింగ్ లో ఉన్నందున తన లుక్ ను పూర్తిగా బయటపడకుండా దాచేశాడు.
సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కి అంబానీలు ఇచ్చిన ఈ ప్రత్యేక ట్రీట్ మెంట్ పై అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కింగ్ ఖాన్ తో పాటు భాయ్ సల్మాన్ ఖాన్ వచ్చినా అతడు చాలా సింపుల్ గా నడుచుకుంటూ అంటిల్లాలోకి వెళ్లిపోయాడు. కానీ షారూక్ మాత్రం కార్ ని లోనికి పోనిచ్చాడని స్పాట్ బోయ్స్ వెల్లడిస్తున్నారు. ఆ మేరకు ప్రముఖ జాతీయ మీడియా కథనం వెలువరించడం హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.