సీనియర్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ ఎప్పుడూ తమిళ పరిశ్రమతో టచ్ లో ఉంటాడు. అక్కడ విడుదలయ్యే సినిమాలపై ఓ కన్నేసి తక్కువ మొత్తానికి దొరికే సినిమాల రైట్స్ తీసుకుని తెలుగులో రిలీజ్ చేస్తుంటాడు. గత ఏడాది హార్రర్ నేపథ్యమున్న మూడు సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు కళ్యాణ్. అందులో ముందుగా వచ్చింది ‘చంద్రకళ’. హన్సిక ముఖ్య పాత్రలో ‘ఆరణ్మయి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయింది. తెలుగులోనూ బాగానే ఆడింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. ‘ఆరణ్మయి-2’గా ఈ నెలాఖరులో విడుదలవుతోందీ సినిమా. దీన్ని తెలుగులోకి ‘ఆరణ్మయి-2’ పేరుతో అనువదిస్తున్నారు.
కానీ నిర్మాత సి.కళ్యాణ్ కాదు. ఆయనెందుకో ఈ సినిమాను వదిలేశారు. ఈ రోజుల్లో - రొమాన్స్ లాంటి సినిమాలు తీసిన గుడ్ సినిమా గ్రూప్ - సర్వంత్రామ్ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ‘చంద్రకళ’లో నటించిన హన్సికతో పాటు త్రిష కూడా ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. ఫస్ట్ పార్ట్ లో డైరెక్టర్ సుందరే హీరోగా నటించగా.. సీక్వెల్లో సిద్ధార్థ్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న సిద్ధు ఇలాంటి హార్రర్ కామెడీలో నటించడం విశేషమే. పూనమ్ బజ్వా కూడా ఓ ముఖ్య పాత్ర పోషించింది. హీరోయిన్లు త్రిష - హన్సిక - పూనమ్ ముగ్గురూ అందాల విందు చేస్తున్న ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే ఆసక్తి రేపాయి. ఈ నెల 29న తమిళ - తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.