'రామ్' భారీ బడ్జెట్ మూవీ.. ప్రొడ్యూసర్స్ రిస్క్ చేస్తున్నారా??

Update: 2021-02-24 02:30 GMT
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రెడ్ మూవీ మోస్తరు విజయాన్ని అందుకుందని చెప్పాలి. యాభైశాతం అక్యూపెన్సీ సమయంలో రెడ్ సినిమా విడుదలైంది. అయితే ఇప్పటికి రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది ఇస్మార్ట్ శంకర్ మాత్రమే.

ఆ సినిమా దాదాపు 40కోట్ల షేర్ రాబట్టగా.. రెడ్ మూవీ  అటుఇటుగా 20కోట్ల షేర్ అందుకుందట. ఇస్మార్ట్ శంకర్ నుండి తన క్రేజ్ మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు రామ్. కానీ తాజాగా తదుపరి సినిమా తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ప్రకటించి షాకిచ్చాడు. పందెంకోడి, ఆవారా సినిమాలతో ఆకట్టుకున్న లింగుస్వామి ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నాడు. వీరి కాంబినేషన్ మూవీ బైలింగువల్ సినిమాగా తెలుగు, తమిళంలో తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సినిమా హీరో రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి నిర్మించబోతున్నారట నిర్మాతలు. ప్రస్తుతం ఈ వార్తలు టాలీవుడ్ వర్గాలలో చర్చలకు దారితీస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సిన ఈ సినిమాను ఏకంగా 75కోట్ల భారీ బడ్జెట్ తో హై క్వాలిటీ అండ్ స్టార్ కాస్ట్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హీరో రామ్ కెరీర్లో ఇప్పటివరకు సినిమాలన్ని 20 - 40కోట్ల వరకే వసూల్ చేసాయి.

అయితే ఇప్పుడు రామ్ తో అంత బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోబోతున్నట్లు సినీవర్గాలలో టాక్. కానీ లాస్ట్ రెండు సినిమాల నుండే రామ్ సినిమాలు మెల్లగా కలెక్షన్స్ రాబట్టడం దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ విధంగా రామ్ సినిమాలు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే చేసాయట.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా నిర్మాతలు రామ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News