36 వ‌ర్సెస్ 48.. ఏజ్ లెస్ క‌పుల్ వ్యాలెంటైన్ స్పెష‌ల్!

Update: 2022-02-15 03:30 GMT
అత‌డికి 36.. ఆమెకు 48.. 12 ఏళ్ల గ్యాప్.. అయితేనేంటి? ఆ ఇద్ద‌రి అన్యోన్య‌త  ప్రేమైక జీవ‌నం ముందు ఏదైనా చిన్న‌బోవాలి. ఇటీవ‌లి కాలంలో ఆ ఇరువురి న‌డుమా ప్రేమ‌భావ‌న‌లు అన్యోన్య‌త‌ అనంతంగా అప‌రిమితంగా పెరుగుతున్నాయే కానీ త‌ర‌గ‌డం లేదు. అందుకు తాజా సాక్ష్య‌మిదే. వ‌య‌సు ప్రేమ‌కు అడ్డంకి కాద‌ని నిరూపిస్తూ ఇప్ప‌టికే ఈ జంట ఎన్నో ఫీట్లు వేసింది. వేలెంటైన్స్ డే రోజున మ‌రో స్పెష‌ల్ ఫోటోతో మ‌రోసారి త‌మ మ‌ధ్య ల‌వ్ ని ఎలివేట్ చేసింది.

ప్రియుని టైట్ హ‌గ్ లో ప్రియురాలు ఎలా ఒదిగిపోయిందో చూసారు క‌దా?  ఇది ఘాటైన ప్రేమ‌ఘ‌ట‌న‌.. మోటైన స‌ర‌స‌న వ‌ద‌న! అంటూ మ‌లైకా అభిమానులు ఈ ఫోటోపై వ్యాఖ్యానిస్తున్నారు. అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక  నోట్ ని కూడా పోస్ట్ చేశాడు. ``మంచి జంట అంటే ఒకరినొకరు వదులుకోవడానికి నిరాకరించే ఇద్దరు అని అర్థం`` అంటూ అదిరిపోయే కొటేష‌న్ ఇచ్చాడు.

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అర్జున్ తమ సంబంధంపైనా మాట్లాడారు. సోషల్ మీడియా జనం డార్క్ యాంగిల్ వైపు చూడ‌డంపై మాట్లాడుతూ..``నేను ఆమెకు అండగా నిలిచాను. ఆమె నాకు అండగా నిలిచింది.

మేము ఈ సంబంధం ద్వారా ఒకరికొకరు అండగా నిలిచాము. ఊహాగానాలు ఎదుర్కొన్నాము. గ‌తుకుల బాట‌ను ఎదుర్కొన్నాము. సుత్తి కబుర్లు ఎదుర్కొన్నాము. సోషల్ మీడియా విషపూరితం కావున‌ కొన్నిసార్లు అనవసరం అనిపిస్తుంది. చాలా రోజులు మాకు నరకమే ఎదురైంది`` అని త‌న‌లోని ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కాడు.

ఇంకా ఏమ‌న్నాడంటే.. ``మేము బహిరంగంగా బ‌య‌ట‌ప‌డినందున‌ ఆమె చాలా ఎదుర్కోవలసి వచ్చింది. కానీ నాకు మా సంబంధానికి చాలా గౌరవం ఇచ్చినందుకు నేను ఆమెను అభినందిస్తున్నాను. మలైకాకు అండగా నిలవడం అసాధారణమైన విషయంగా ఎప్పుడూ అనిపించలేదు.

ఇది సరైన విషయం.. అత్యంత సహజమైన పని`` అని భావిస్తాను అన్నాడు. మలైకా గురించి ఒక్క వాక్యంలో వివరించమని అడిగినప్పుడు అర్జున్ ఇలా అన్నాడు: ``చాలా కష్టం. ఒక్క వాక్యం సరిపోదని నా అభిప్రాయం. నేను ఇబ్బందుల్లో పడతాను`` అని అన్నాడు.

మలైకా నన్ను నేను మరింతగా విశ్వసించేలా చేయడం ద్వారా ఒక వ్యక్తిగా నన్ను మార్చింది. నేను ఎప్పుడూ నా ఆత్మను విశ్వసించే వ్యక్తిని.. కానీ నా బలహీనమైన క్షణాలలో కూడా ఆమె నాకు సహాయం చేసింది. ఆమె ఎప్పుడూ అంత ఎత్తున‌ ఉంటుంది.. నేను విలువైనవాడినని నాకు అర్థమయ్యేలా చేసింది`` అని తెలిపాడు.
Tags:    

Similar News