అలా ప్రేమించుకుంటే వెర్రితనం.. హీరో గారి ప్రేమ పాఠాలు

Update: 2022-01-04 01:30 GMT
బాలీవుడ్‌ లో చాలా ప్రేమ జంటలు ఉన్నాయి.. కాని అన్ని జంటల్లోకి అర్జున్‌ కపూర్‌ మరియు మలైకాల జంట గురించి ఎక్కువ సందర్బాల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అర్జున్‌ కపూర్‌ వయసు మలైకా వయసు కంటే పుష్కర కాలం అంటే 12 ఏళ్లు తక్కువ. పైగా మలైకా కు గతంలో పెళ్లి అయ్యి విడాకులు అయ్యింది. పెళ్లి అయ్యి సుదీర్ఘ కాలం పాటు భర్తతో ఉన్న మలైకా తో అర్జున్‌ కపూర్‌ ప్రేమ అంటే మొదట్లో చాలా మంది విమర్శించారు. ఆ విమర్శలను వారు పట్టించుకోకుండా తమ జీవితాన్ని తాము ఎంజాయ్ చేస్తాము అన్నట్లుగా లైఫ్ లో ముందుకు సాగుతున్నారు. అయినా కూడా వీరి ప్రేమ.. ఇద్దరి మద్య వయసు తేడా గురించి చర్చ జరుగుతూనే ఉంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్జున్‌ కపూర్ మరోసారి ఆ విషయమై స్పందించాడు. మీడియాలో కొందరు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే అందులో 90 శాతం మంది ఫేక్ అకౌంట్స్ నుండి చేస్తున్నారు. అలా చేస్తున్న వారే మేము కనిపించిన సమయంలో సెల్ఫీలు అడుగుతుంటారు. అందుకే వాటిని మేము నమ్మాలనుకోవడం లేదు. ఇలాంటి విషయాలపై స్పందన కోరుతున్నది మీడియా మాత్రమే. జనాలు ఈ విషయాలపై పెద్దగా ఆసక్తిగా ఉండరు అంటూ అర్జున్‌ కపూర్‌ పేర్కొన్నాడు.

వయసు తేడా అంటూ కొందరు చేస్తున్న ట్రోల్స్ విషయంలో అర్జున్‌ కపూర్‌ స్పందిస్తూ... నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైనా చేయవచ్చు. అది నా హక్కు. ఇతరులు ఆ విషయమై ప్రశ్నించడానికి అవకాశం లేదు. నేను చేసే పనిని గుర్తిస్తే చాలు.. ఇతర విషయాల గురించి వారు ఎంతగా మాట్లాడుకున్నా నేను పట్టించుకోను. చాలా మంది అంటున్నట్లుగా ఎవరి వయసు ఎంత అనే విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. అయినా వయసు ను చూసి రిలేషన్ లో ఉండటం అనేది.. వయసును బట్టి ప్రేమించుకోవడం అనేది వెర్రితనం అవుతుందని అర్జున్ కపూర్‌ ప్రేమ పాఠాలు చెప్పాడు. మనసుకు నచ్చినట్లుగా జీవితంను సాగించాలి.. మనసుకు ఎవరు అయితే నచ్చుతారో వారితో జీవితాంతం కలిసి ఉండాలి అన్నట్లుగా ఆయన జీవిత సత్యాలను ప్రేమ పాఠాలను చెప్పాడు. మరి ఇప్పటికి అయినా వారి ప్రేమ విషయమై నెటింట వచ్చే ట్రోల్స్ ఆగేనా చూడాలి.



Tags:    

Similar News