ఇంతకీ అరవ అర్జున్ రెడ్డి ప్రాబ్లం ఏంటి?

Update: 2019-07-07 11:14 GMT
చియాన్ విక్రం వారసుడు ధృవ్ ఎంట్రీకి పెట్టుకున్న ముహూర్తం బాగున్నట్టు లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ గా తమిళ్ లో రెండు సార్లు తీసిన ఆదిత్య వర్మ విడుదల మళ్ళీ సందిగ్ధంలో పడ్డట్టు చెన్నై టాక్. మొదటిది బాలాతో తీయించి ఫైనల్ కాపీ వచ్చాక తూచ్ ఇది బాలేదు అని చెప్పి పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. జరిగిందేదో జరిగిందనుకుని సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ గిరిశాయను పెట్టుకుని హీరోని తప్ప మిగిలిన యాక్టర్స్ అందరిని మార్చి రెండో వెర్షన్ ఫస్ట్ నుంచి తీశారు.

ముందు అనుకున్న వర్మ టైటిల్ కి ఆదిత్య అని తగిలించి కొత్తది ఫిక్స్ చేశారు. దీని షూటింగ్ కూడా వేగంగానే పూర్తయ్యింది. టీజర్ కూడా వదిలారు. మొదటిదాని కంటే నయమన్నారు కానీ దీనికీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఏమి రాలేదు. ఫ్యాన్స్ సైతం సోసోగానే ఉందన్నారు. ఇప్పుడు హిందీ రీమేక్ కబీర్ సింగ్ వచ్చాక అసలుకే మోసం వచ్చేసింది.

ఒరిజినల్ అర్జున్ రెడ్డితో పోలికకే ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఇప్పుడు కొత్తగా కబీర్ సింగ్ తోడవ్వడంతో ఆదిత్య వర్మ రిలీజ్ త్రిశంకు స్వర్గంలో పడిందట. ఇప్పటికే నిర్మాతలకు తడిసి మోపెడయ్యింది. తెరవెనుక విక్రమ్ పెట్టుబడి పెట్టాడు అనే టాక్ ఉంది కానీ లోగుట్టు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆదిత్య వర్మని కబీర్ సింగ్ హీట్ చల్లారాక రిలీజ్ చేస్తారా లేక కోట్లు పోతే పోయాయి అనుకుని వదిలేస్తారా వేచి చూడాలి. అయినా విక్రమ్ టీమ్ వరుస చూస్తుంటే ధృవ్ లాంచ్ విషయంలో మరీ ఓవర్ గా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది


Tags:    

Similar News