మెగా రూట్లో నడుస్తున్న బాహుబలి

Update: 2017-03-24 13:08 GMT
కాలంతో పాటు ట్రెండ్ కూడా మారిపోవాలి. ఎప్పటికప్పుడు క్రియేట్ అయ్యే కొత్త ట్రెండ్ లోనే అడుగులు వేయాలి. లేకపోతే పాత చింతకాయ పచ్చడి అనే ఫీలింగ్ జనరేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే టాలీవుడ్ ఖ్యాతిని దశదిశలా చాటిన బాహుబలి కూడా.. మెగా హీరోల రూట్లో నడవక తప్పడం లేదు. ఇండస్ట్రీ అంతా ఆడియో ఫంక్షన్స్ హంగామాలో ఉన్న సమయంలోనే.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ మొదలుపెట్టారు.

అల్లు అర్జున్ సరైనోడుతో ఇది ప్రారంభమైతే.. ఆ తర్వాత రామ్ చరణ్ ధృవ.. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150.. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు వరకూ ఇది కంటిన్యూ అయింది. ఇప్పుడు మిగిలిన వారు ఆడియో ఫంక్షన్లు మానేసి అందరూ ఇదే రూట్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై అనౌన్స్ మెంట్ కూడా చేసేయడం విశేషం. "మార్చ్ 26న హైద్రాబాద్ లో బాహుబలి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. తెలుగు ఆడియో అదే రోజు నుంచి స్టోర్స్ లో లభిస్తుంది" అంటూ అధికారిక ప్రకటన చేశాడు జక్కన్న.

సాధారణంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ అంటే.. రిలీజ్ కి రెండు వారాల్లోపు చేస్తుంటారు. కానీ నెలకు పైగా సమయం ఉన్నా.. ట్రెండ్ కు తగినట్లుగా తన వేడుకకు ప్రీ రీలీజ్ ఫంక్షన్ అని పేరు పెట్టాడు రాజమౌళి. అయితే.. ఈ  వేడుకను 4కే రిజొల్యూషన్ తో 360 డిగ్రీస్ యాంగిల్ లో లైవ్ ఎక్స్ పీరియన్స్ లో కూడా చూడచ్చని.. ఈ 360 డిగ్రీస్ లైవ్ టెలికాస్ట్ మార్చ్ 26న సాయంత్రం 6.30కి మొదలువుతుందని చెప్పాడు రాజమౌళి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News