బాహుబలి-2.. అమ్మేది లేదంటున్నారు

Update: 2016-04-29 12:12 GMT
ఓ సినిమా షూటింగులో ఉండగానే భారీ లెవెల్లో బిజినెస్ ఆఫర్లు వస్తే.. ఓ కార్పొరేట్ సంస్థే హోల్ సేల్ గా సినిమాను కొనేయడానికి సిద్ధ పడితే వద్దని ఏ నిర్మాత అయినా అంటాడా..? కానీ ‘బాహుబలి’ నిర్మాతలు మాత్రం ఇలాగే చేస్తున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం వస్తున్న భారీ బిజినెస్ ఆఫర్లను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారట నిర్మాతలు శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేని. బాహుబలి-2 మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు.. తమిళం.. హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఆసక్తిని గమనించే ‘బాహుబలి: ది బిగినింగ్’తో పోలిస్తే చాలా ఎక్కువకే సినిమాను అడుగుతున్నారట బయ్యర్లు.

తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషల నుంచి కూడా విపరీతమైన డిమాండ్ నెలకొందట. బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసి ఫిదా అయిపోయిన ఓ కార్పొరేట్ సంస్థ అధినేత సినిమాను హోల్ సేల్ గా కొనేయడానికి ముందుకొచ్చాడట. ఇందు కోసం మంచి ఆఫర్ కూడా ఇచ్చారట. కానీ బాహుబలి నిర్మాతలు మాత్రం ఇప్పుడు బిజినెస్ డీలింగ్స్ మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారట. మిగతా బయ్యర్లకూ ఇదే మాట చెప్పారట. సినిమా విడుదలకు ముందు వచ్చే హైప్ చూసి.. ఆ టైంలోనే బిజినెస్ ఓపెన్ చేయాలని శోభు-ప్రసాద్ భావిస్తున్నారట. ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులేమీ లేకపోవడంతో ఇప్పుడే డీల్స్ మాట్లాడాల్సిన అవసరమేమీ లేదని భావించి బిజినెస్ ఆఫర్లను తిరస్కరిస్తున్నారట.
Tags:    

Similar News