బాహుబ‌లి... కొత్త అనౌన్స్‌ మెంట్‌!

Update: 2016-02-03 07:48 GMT
రాజ‌మౌళి సినిమా చూడాలంటే రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే అని ఫిక్స‌యిపోతుంటారు జ‌నాలు. ఆయ‌న సినిమాలు తీసే విధానం... వాటి స్థాయి అలా ఉంటుంది మ‌రి! అయితే బాహుబ‌లి 2 విష‌యంలో మాత్రం ఆయ‌న ప్రేక్ష‌కుల్ని ఎక్కువ‌గా వెయిట్ చేయించేలా క‌నిపించ‌డం లేదు. వీలైనంత త్వ‌ర‌గానే బాహుబ‌లి 2ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని త‌న చిత్ర‌బృందాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు రాజమౌళి. ప‌క్కాగా స్క్రిప్టు సిద్ధ‌మ‌వ‌డం, వీఎఫ్ ఎక్స్ బృందం కూడా వేడిమీద ఉండ‌టంతో బాహుబ‌లి 2 ఈ యేడాది చివ‌ర్ని రావ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే ర‌క‌మైన సంకేతాలు బాహుబ‌లి టీమ్ నుంచి కూడా వ‌స్తున్నాయి.

ఇటీవ‌లే కేర‌ళ‌లో ఒక షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌భాస్‌, రాజ‌మౌళి అంతా కూడా హైద‌రాబాద్‌ కి తిరిగొచ్చారు. వాళ్లు తిరిగొచ్చారో లేదో వెంట‌నే  ఒక  ఎక్సైటింగ్ ఎనౌన్స్‌ మెంట్‌ కి రంగం సిద్ధం చేశారు. బాహుబ‌లి 2కి సంబంధించి ఈ రోజునే ఓ కొత్త ఎనౌన్స్‌ మెంట్‌ ని ప్ర‌క‌టించ‌బోతున్నారు. అయితే అది ఏ విష‌యంపై అన్న‌ది మాత్రం సస్పెన్స్‌. ప్ర‌చార వ్యూహాల్లో బాహుబ‌లి టీమ్‌ కి తిరుగులేదు. బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌క‌ముందే ర‌క‌ర‌కాల దారుల్లో ఆసినిమాకి ప్ర‌చారం చేశారు. ఇప్పుడు కూడా అదే ర‌క‌మైన ప్ర‌చార వ్యూహాల‌కి తెర తీయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అస‌లింత‌కీ ఆ ఎక్స‌యిటింగ్ అనౌన్స్‌ మెంట్ ఏంట‌న్న‌ది మాత్రం ఈ రోజు సాయంత్రంలోగా తెలిసిపోతుంది.
Tags:    

Similar News