జపాన్ జనాలకు మన బాహుబలి విపరీతంగా నచ్చేశాడు. ఆ దేశంలో బాహుబలి మేనియా కనిపించింది. అక్కడ ఈ చిత్రం భారీ సక్సెస్ కావడం మాత్రమే కాదు.. 100 రోజులకు పైగా ఆడేసి ఆశ్చర్యపరిచింది. జపాన్ ఆడియన్స్ తమ మూవీని మెచ్చిన తీరును ముగ్ధులైన దర్శకుడు రాజమౌళి.. నిర్మాత శోభు.. జపాన్ సందర్శించి మరీ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలతో ముచ్చట్లు ఆడారు,
జపాన్ వాసులకు బాహుబలి ఎంతగా నచ్చేసిందంటే.. ఇప్పుడు జపాన్ లో ఓ కామిక్ బుక్ కూడా తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఓ జపనీస్ కంపెనీ ఇప్పటికే బాహుబలి టీంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. బాహుబలిపై కామిక్ బుక్ సిరీస్ తెచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి కూడా. తన మూవీపై కామిక్ సిరీస్ ను విడుదల చేయనుండడం.. అదికూడా మరో దేశంలో.. మరో భాషలో కావడంపై రాజమౌళి తెగ సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి ఓ సంఘటన జరుగుతుందని తాను ఎన్నడూ అనుకోలేదని చెబుతున్నాడు.
'నేను చిన్నప్పటి నుంచి కామిక్ బుక్స్ విపరీతంగా చదివేవాడిని. నన్ను ఫిలిం మేకింగ్ కు ప్రోత్సహించడంలో వాటి పాత్ర చాలా ఎక్కువ. ఇప్పుడు నా సినిమానే కామిక్ బుక్ గా రూపొందుతుండడం చూస్తే.. నా జీవితం పరిపూర్ణం అయిందనే భావన కలుగుతోంది' అని చెబుతున్నాడు రాజమౌళి.