విక్టరీ వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా బాబు బంగారం. గోపాలా గోపాలా రిలీజ్ అయ్యి ఏడాదేగా అయింది.. బాగా గ్యాప్ అంటే ఎలా అనుకోవచ్చు.. వెంకీ సినిమాలు చేసే స్పీడ్ తో పోల్చితే.. ఏడాదికో సినిమా అంటే చాలా స్లో అనాల్సిందే. అయితే.. గత సినిమాలు ఇచ్చిన రిజల్ట్ ను బేస్ చేసుకుని.. చాలా అలర్ట్ గా సినిమాలు చేస్తున్నాడు వెంకటేష్.
భలే భలే మగాడివోయ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మారుతీ.. వెంకీ, నయనతారలతో తీస్తున్న బాబు బంగారంకి ఇప్పుడు టీజర్ పోస్టర్ రిలీజ్ చేశారు. టీజర్ ను జూన్ 6న విడుదల చేయబోతున్నట్లు చెప్పింది యూనిట్. వెంకటేష్, నయనతారలు జోడీ కట్టడం ఇదేమీ మొదటిసారి కాకపోయినా.. ఈ పోస్టర్ లో వీరిద్దరూ మాత్రం మాంచి ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు. పోస్టర్ లో తన పాత చిత్రాల సెంటిమెంట్ ని గట్టిగానే ఫాలో అయ్యాడు దర్శకుడు మారుతి.
భలే భలే మగాడివోయ్ కి ఉపయోగించిన ఫాంట్ తోనే 'బాబు బంగారం' టైటిల్ కూడా డిజైన్ చేశారు. అలాగే ఈ సినిమా లోగోను చూస్తుంటే.. ఈ రోజుల్లో- ప్రేమకథా చిత్రంలలో ఉన్న సింప్లిసిటీ కనిపిస్తోంది. అయితే.. ఈ పోస్టర్ లో మాత్రం.. వెంకీ - నయన్ ల లుక్ స్పెషల్ అట్రాక్షన్ అనాల్సిందే.