ఈ నగరాన్ని ***(బీప్ - సెన్సార్ కట్ అన్నమాట) పోయించడానికి వచ్చాను. యే బొంబాయ్ షహర్ కో పిషాబ్ కర్వానే ఆయా అని బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు చలరేగిపోయినటించాడు. ఒక సిటీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ నడిపించడం ఈ మధ్యకాలంలో పూరికే చెల్లింది. అయితే ముంబాయితో మహేష్ కి వున్నా అనుబంధం మరో సినిమా ద్వారా మరింత ముడిపడనున్నట్టు సమాచారం.
బ్రహ్మోత్సవం సినిమా తరువాత మహేష్ - మురగదాస్ ల కాంబినేషన్ లో ఒక సినిమా కార్యరూపం దాల్చనున్న విషయం తెలిసినదే. ఈ సినిమాను కుడా ముంబాయి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనికోసం త్వరలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ లోకేషన్ల వేటకు వెళ్ళనున్నట్టు తెలుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికీ ఏ విధమైన అధికారిక ప్రకటన రాకపోయినా ఇండియన్ పీనల్ కోడ్ వ్యవస్థ ను ప్రశ్నించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చట్టం తో పోరాటం అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది.