అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎపిసోడ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్డింగ్ లో నిలిచింది. ఆయన మాట్లాడిన పలు విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ముఖ్యంగా పూరి జగన్నాద్ గురించి చేసిన వ్యాఖ్యలను మొదలుకుని తన కొడుకు హాలీవుడ్ ఎంట్రీ వరకు చాలా చాలా విషయాలను ఆయన చెప్పడం.. అవి ప్రస్తుతం వైరల్ అవ్వడం జరుగుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్న మరో విషయం పవన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు.
హోస్ట్ అలీ ఒక్కో హీరో పేరు చెప్తే ఆ హీరోకు ఎలాంటి కథ అయితే బాగుంటుందో చెప్పండి అంటూ పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన సమయంలో విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ.. ఆయన సినిమా అంటే కథ అవసరం లేదు. ఆయన వెండి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు మించి ఆయన నుండి ఆశించడం లేదు. అందుకే పవన్ గొప్ప కథలతో కాకుండా సింపుల్ గా ఆయన పాత సినిమాల క్లిప్లింగ్ లకు పేర్లు మార్చి అమ్మాయిలతో సరదా సన్నివేశాలు.. కాస్త యాక్షన్ సన్నివేశాలను జోడించగలిగితే కథ అక్కర్లేదు సినిమా ఆడేస్తుందని అన్నాడు.
విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పవన్ కు ఉన్న క్రేజ్ మరియు ఆయన స్టార్ డమ్ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ అలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నా కూడా ఆయన మాటల్లో కాస్త నిజం ఉండే ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో కాస్త కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేస్తే చాలు కథ గురించి పట్టింపు లేకుండా అభిమానులు సినిమా ను హిట్ చేసేస్తారు అనేది ఆయన అభిప్రాయం.. ఇదే అభిప్రాయంను గతంలో కూడా ఇద్దరు ముగ్గురు పెద్ద దర్శకులు వ్యక్తం చేశారు.