వీకెండ్ లో భారీ రిలీజ్ చేసి శుక్ర - శని - ఆది వారాల్లో పెట్టుబడుల్ని తిరిగి లాక్కోవాలనే తారకమంత్రం పటిస్తున్నారు ఫిలిమ్‌మేకర్స్. దానికోసం ప్రపపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లను ముందే బుక్ చేసేస్తున్నారు. దీనివల్ల నేటి సినిమా హిట్టయినా పట్టుమని రెండువారాలు ఆడని పరిస్థితి. ఇంతకుముందులా 50రోజులు - 75రోజులు - 100రోజులు, సిల్వర్ జూబ్లీలు ఏవీ లేవు ఇప్పుడు. అవన్నీ కనుమరుగై వాటి స్థానంలో సక్సెస్ మీట్ లు - ప్లాటినం డిస్కులే కనిపిస్తున్నాయి. అయితే అన్నిటినీ బీట్ చేస్తూ హిస్టరీని క్రియేట్ చేశాయి ఓ మూడు సినిమాలు. కనీవినీ ఎరగని రీతిలో 50రోజులు పూర్తి చేసుకుని రికార్డులు సృష్టించాయి.
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి - కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన భజరంగి భాయిజాన్ - అజయ్‌దేవగన్ దృశ్యం .. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దిగ్విజయంగా 50రోజులు పూర్తి చేసుకున్నాయి. అర్థశతకం అనే మాట ఇటీవలి కాలంలో లేనేలేదు. కానీ చరిత్రను తిరగరాశాయి ఈ సినిమాలు. మూడు సినిమాలకు సంబంధించిన హాఫ్ సెంచరీ రిపోర్టులు చూస్తుంటే సినిమాకి మంచి రోజులొచ్చాయని అనిపిస్తోంది. ఇలా హాఫ్ సెంచరీలు, సెంచరీలు కొట్టాలన్న ఆసక్తి లేదు కానీ, ఇలా ఆడే సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమౌళి అన్నారు.
ఏదేమైనా మంచి కథ - కథనం - విజువల్ నేరేషన్ ఉంటే ఆ సినిమాలు ఇలాంటి విజయాల్ని అందుకుంటాయని చెప్పొచ్చు. ఇది శుభపరిణామం. పరిశ్రమకి మంచి రోజులొచ్చినట్టే. ఇలాంటి మరిన్ని హిట్లు రావాలని ఆకాంక్షిద్దాం. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు బాహుబలి లాగా బాలీవుడ్ ని దండెత్తాలని ఆకాంక్షిద్దాం.