నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో చిత్రానికి సిద్ధమైపోయారు. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేయబోతున్నట్లుగా అధికారికంగానే ప్రకటించారు. యావత్ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితాన్ని సినిమాగా రూపొందిస్తున్నారు బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గుణశేఖర్ ఇప్పటికే చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిని రూపొందించి, సినీ పరిశ్రమలో ఓ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు బాలయ్య కూడా చారిత్రాత్మక చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే రుద్రమదేవి చిత్రం కోసం గుణశేఖర్ అన్ని నిజమైన ఆభరణాలనే ఉపయోగించాడు. తమిళనాడుకు చెందిన ఎన్ ఏసీ జ్యూవెల్లర్స్ సంస్థతో వీటిని తయారు చేయించారు.
ఈ విషయంలో కూడా బాలయ్య.. తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో.. అన్నీ ఒరిజినల్ నగలనే ఉపయోగించనున్నారట. ఇందుకోసం కార్పొరేట్ గోల్డ్ రిటైల్ మాల్స్ తో చర్చలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.