నటసింహా నందమూరి బాలకృష్ణ `కథానాయకుడు` ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించలేదా? ప‌్రస్తుతం ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ ఇది. కథానాయకుడు ఆడియో వేదికకు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ - రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ - మోహన్ బాబు - పరుచూరి వంటి వారిని ఆహ్వానించారు. ఇంకా ఎందరో ప్రముఖుల్ని పిలిచారు. కానీ చిరంజీవిని పిలవలేదా? అంటూ ఆసక్తికరంగా మాట్లాడుకోవడం వేడెక్కిస్తోంది.
కథానాయకుడు ఈవెంట్ ఆద్యంతం నందమూరి ఫ్యామిలీ హీరోలు హైలైట్ అయ్యారు. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా మాట్లాడి ఆకట్టుకున్నారు. మోహన్ బాబు కామెంట్లు అంతకుమించి వేడెక్కించాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ తాను ఎన్టీఆర్ కి అభిమానిని అని వేదికపైనే తెలిపారు. కృష్ణంరాజు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇంతమంది ఇన్నిరకాలుగా హడావుడి చేసిన ఈ వేదికపై మెగాస్టార్ ఎందుకు మిస్సయినట్టు? బాలకృష్ణ - చిరంజీవి చాలాసార్లు స్నేహితులుగానే కనిపించారు. అయినా ఈ వేడుకకు చిరుని బాలయ్య పిలవలేదా? అంటూ మాట్లాడుకున్నారంతా.
అయితే వాస్తవం వేరుగా ఉంది. బాలయ్య స్వయంగా చిరుకి కాల్ చేశారు. ఎన్టీఆర్- కథానాయకుడు ఆడియో వేడుకకు ఆహ్వానించారు. కానీ మెగాస్టార్ ఔట్ డోర్ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారట. కేవలం అందుబాటులో లేకపోవడం వల్లనే రాలేకపోయారని తెలిసింది. ఈ వేదికపై అక్కినేని కుటుంబం నుంచి ఒకే ఒక్క సుమంత్ తప్ప ఇంకెవరూ పెద్దలు కనిపించలేదు. కింగ్ నాగార్జున మిస్సయ్యారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ మిస్సింగ్ అంటూ వేడెక్కించే చర్చ సాగింది.