చిరంజీవి లేని తెలుగు సినిమానా? -బండ్ల గణేష్‌

Update: 2015-03-16 08:17 GMT
మరోసారి తన ట్వీట్స్‌తో హోరెత్తించాడు నిర్మాత బండ్ల గణేష్‌. ప్రతీసారి పవన్‌ దేవుడు, చరణ్‌ బాబు ఇంద్రుడు. నా బాద్షా నా శ్రీరాముడు అంటూ భజన చేసే గణేష్‌ బాబు, ఈసారి మాత్రం కొన్ని నిజాలు చెబుతూ ఊగిపోయాడు. అసలు సందర్భోచితంగా సెటైర్లు వేయడంలో బండ్ల రేంజే రేంజ్‌. ఈసారి మనోడు ఎవరి మీద ఈ సెటైర్స్‌ వేశాడో ఇక వేరే చెప్పక్కర్లేదు.

అసలు గణేష్‌ ఏమంటున్నాడంటే...

''రాముడు లేని రామాయణమ్‌ చదవం.చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం. కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్థార్‌. రామారావుగారు నాగేశ్వరరావుగారు కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెం.1 అయ్యి మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్‌.. చిరంజీవి. తెలుగువారి క్యాలెండర్లో పండగలు ఉంటే తెలుగు సినీపరిశ్రమ కాలెండర్లో చిరంజీవిగారి సినిమా రిలీజ్‌ డేట్స్‌ ఉంటాయి'' అంటూ చిరు గొప్పదనాన్ని కొనియాడాడు.

ఇక చిరంజీవి ఎందరికి ఇన్స్‌పిరేషన్‌ అనేది చెబుతూ.. ''డాన్సు నేర్చుకోవాలంటే ఫైట్స్‌ ప్రాక్టిస్‌ చెయ్యాలంటే నడవాలంటే నిలబడాలంటే చూసే స్టార్‌ మెగాస్టార్‌ చిరంజీవిగారివి కాదా. చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం. బాక్సాఫీస్‌ను రీ-డిఫైన్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి సైకిల్‌ స్టాండ్‌ ఎంప్లాయి నించి నెంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్‌ సినిమా. ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్‌ జిందాబాద్‌'' అంటూ ముగించాడు.

''జై చిరంజీవ!! జై చిరంజీవ!'' అంటున్న బండ్ల బాబు.. తన మెసేజ్‌ను క్లియర్‌గా ఎవరికి చెబుతున్నాడో కూడా చెప్పేసి ఉంటే బాగుండేదేమో.

Tags:    

Similar News