'ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా'.. మోహన్ బాబుపై బెనర్జీ షాకింగ్ కామెంట్స్..!
గతేడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించేలా జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో దిగిన మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ ప్యానల్స్ ఆరోపణలు ప్రత్యారోపణనలు.. వినర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ఈ వేడి ఎలక్షన్స్ ముగిసిన కొన్నాళ్ల వరకూ కొనసాగింది.
రసవత్తరంగా జరిగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందారు. అయితే ప్రత్యర్థి వర్గం సభ్యులు ఈ ఎన్నికలు జరిగిన తీరుపై విమర్శలు చేసారు. దురదృష్టకర సంఘటనలు జరిగాయని.. మంచు మోహన్ బాబు మరియు సీనియర్ నటుడు నరేశ్ తమ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన బెనర్జీని మోహన్ బాబు కొట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. బెనర్జీ సైతం తీవ్ర బావోద్వేగానికి గురవుతూ తనను మోహన్ బాబు అర గంట సేపు బూతులు తిట్టారని.. కొట్టటానికి వచ్చారని మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీనిపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బెనర్జీ స్పందించారు.
ఆ రోజు మోహన్ బాబు గారు నా మీద చెయ్యి చేసుకోలేదు. అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్. జరగకుండా ఉంటే బాగుండేది అని బెనర్జీ అన్నారు. ఈగోల వల్లనే ఎన్నికలప్పుడు అంత జరిగిందని కీలక వ్యాఖ్యలు చేసాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను గమనించి ప్రకాష్ రాజ్ ను నిలబెడదామని అనుకున్నారు. మేమంతా మాట్లాడుకుని చిరంజీవి గారి సపోర్ట్ తీసుకున్నాం. ప్రకాష్ రాజ్ దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో నిలబడతాడు అని ఇండస్ట్రీలో అందరికీ ఫోన్ లు చేసి చెప్పాం. మోహన్ బాబు గారు సహా అందరికీ ఈ విషయం తెలుసు. నాకు తెలిసిన దాని ప్రకారం కొన్ని రోజుల తర్వాత సడన్ గా విష్ణు పోటీలో నిలబెట్టాలని మోహన్ బాబు గారు చిరంజీవి గారి వద్దకు వెళ్లారు. 'ప్రకాష్ రాజ్ కు మాట ఇచ్చాను.. ఈ రెండేళ్లు అంతా సెట్ అవుతుంది.. దాని తర్వాత విష్ణు ను ప్రపోజ్ చేద్దాం. ఏకగ్రీవంగా ఎన్నికచేద్దాం' అని చిరంజీవి గారు చెప్పారు. ఏం జరిగిందో తెలియదు విష్ణు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
నాకు మోహన్ బాబు గారు ఫోన్ చేసి 'విష్ణు నిలబడుతున్నాడు.. నువ్వు ఇక్కడ ఉండాలి' అన్నాడు. 'అది కాదు అన్నయ్యా.. మేము ఆల్రెడీ ఇక్కడ ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేసాం. మీకు కూడా అది తెలుసు. మేం మాట ఇచ్చేసాం. మీరేమో మాట మీద నిలబడాలి అంటుంటారు కదా.. మేము కూడా మాట మీద నిలబడాలి కదా. ఏమీ అనుకోకండి' అని నేను అన్నాను. 'సర్లేరా.. ఓకే' అని మోహన్ బాబు గారు అన్నారు.
నేను చెప్పినా రాలేదని మనసులో ఏమైనా పెట్టుకున్నారేమో. ఎలెక్షన్స్ లో తనీష్ ను ఏదో అంటుంటే.. ఏంటని నేను ముందుకు వెళుతున్నాను. అంతలోనే ఆయన కోపంతో బూతులు తిట్టడం మొదలు పెట్టారు. అసలు సంబంధం లేకుండా ఆయనలా మాట్లాడేసరికి నేను షాకయ్యాను. ఇంతలో విష్ణు - మనోజ్ వచ్చి నచ్చజెప్పారు.
ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. మా కుటుంబం గురించి కూడా ఆయనకు తెలుసు. ఒకరికొకరం బాగా తెలుసు. లక్ష్మీ ని నేను చిన్నప్పుడు ఎత్తుకున్నాను. అలాంటిది ఆయన అలా మాట్లాడేసరికి నేను షాక్ అయి పక్కన కూర్చుండిపోయాను. ఏడుపు వచ్చేసింది. రెండు మూడు రోజులు మెంటల్ గా బాగా అప్సెట్ అయ్యాను. వేరే వాళ్ళు తిడితే నేనూ తిట్టేస్తా. కానీ అప్పుడు నేనేం మాట్లాడలేదు. అది ఆయన విజ్ఞతకే వదిలేశాను అని యాక్టర్ బెనర్జీ చెప్పుకొచ్చాడు.
కాగా, 'మా' ఎన్నికల జరిగిన పరిణామాలను వివరిస్తూ బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. నరేష్ తనను ముఠా నాయకుడు అన్నా కూడా ఇన్నాళ్లూ మౌనంగానే ఉన్నానని.. ఎన్నికల రోజు మోహన్ బాబు తనను బూతులు తిట్టారని.. కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. మూడు రోజులుగా నిద్రలేదు. ఎలక్షన్స్ లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయానని అన్నారు.
మోహన్ బాబుదారుణంగా మాట్లాడారని.. తానెప్పుడూ ఇటువంటి మాటలు పడలేదన్నాడు. మోహన్ బాబు కి పెళ్లి కాకముందే తాను ఆయన ఇంట్లో సభ్యుడిగా ఉండేవాడినని.. మంచు లక్ష్మిని ఎత్తుకుని తిరిగానని.. కానీ ఆయన వందల మందిలో అమ్మానా బూతులు తిట్టారు. కొట్టడానికి వచ్చారు. చాలా బాధ కలిగింది. మా ఫ్యామిలీ కూడా బాధ పడింది. ఇలాంటి అసోసియేషన్ లో ఎందుకు ఉండాలి. ఇంత అవమానంతో ఎందుకు బతకాలి అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత భారం తగ్గింది అని బెనర్జీ అప్పట్లో మీడియా ముఖంగా చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.