నాగార్జున ద్వి పాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు కొనసాగింపు అన్నట్లుగా ప్రస్తుతం బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. బంగార్రాజు టైటిల్ తో సోగ్గాడు మళ్లీ వచ్చాడు అంటూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నాగార్జునతో పాటు ఈ సినిమాలో నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా స్పీడ్ గా తెరకెక్కుతోంది. సినిమాలో బంగార్రాజు ఎక్కువ శాతం స్వర్గ లోకంలో కనిపించబోతున్నాడట. అలాగే నాగ చైతన్య మరియు హీరోయిన్ కృతి శెట్టిల కాంబో సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. కృతి శెట్టి పాత్ర ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బంగార్రాజు ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తంను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఇక నేడు దీపావళి సందర్బంగా బంగార్రాజు టీమ్ చిన్న వీడియోను విడుదల చేశారు. నాగ చైతన్య మరియు కృతి శెట్టి కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో వీడియో ప్రారంభం అవుతుంది. రమ్యకృష్ణ క్రాకర్స్ తో కనిపించగా.. సినిమాలో నటించిన వారు హ్యాపీ దీపావళి అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా సోగ్గాడు నాగార్జున వచ్చి పండుగ లాంటి సినిమా మా బంగార్రాజు అంటూ చెప్పి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా కు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ను వచ్చే సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక ఈ దీపావళి వీడియోతో ఒక విషయాన్ని క్లీయర్ చేశారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించడం లేదేమో అంటూ పుకార్లు షికార్లు చేశాయి. నాగ్ పాత్ర కోసం శ్రియ శరన్ ను సంప్రదించారని ప్రచారం జరిగింది. కాని అది నిజం కాదని సోగ్గాడే చిన్ని నాయన తరహాలోనే ఈ సినిమాలో కూడా నాగ్ కు జోడీగా రమ్యకృష్ణ నటించబోతుందని క్లారిటీ ఇచ్చారు. నాగార్జున మరియు నాగ చైతన్యలు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారా లేదా తాత మనవడుగా నటిస్తున్నారా అనే విషయమై కూడా చర్చ జరుగుతోంది. విశ్వసనంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున తాతగా.. నాగ చైతన్య జులాయి మనవడిగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి బంగార్రాజు సినిమా ను సోగ్గాడే చిన్ని నాయన తరహాలో మంచి వినోదాత్మక సినిమాగా మల్చుతున్నట్లుగా తెలుస్తోంది.