తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. పది వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ మరో నెల రోజుల్లో పూర్తి అవ్వబోతుంది. ఈ సమయంలో కూడా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ విషయమై చర్చ జరుగుతోంది. ఈ సీజన్ లో రీ ఎంట్రీలు కనిపించలేదు. ఎందుకంటే కరోనా కారణంగా మళ్లీ రెండు వారాల పాటు క్వారంటైన్ ఆ తర్వాత కరోనా టెస్ట్ ఇన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా రీ ఎంట్రీ ఇవ్వకుండా అలా అలా నడిపిస్తున్నారు. సీజన్ మొదటి రెండు మూడు వారాల నుండి కూడా ఆ కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. ఈ కంటెస్టెంట్ రీ ఎంట్రీ అంటూ తెగ ప్రచారం జరిగింద.ఇ
టీవీ9 దేవి విషయంలో చాలా ప్రచారం జరిగింది. ఆమె రీ ఎంట్రీ కన్ఫర్మ్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆమె రీ ఎంట్రీ జరగలేదు. ఇక ఆమె తర్వాత కుమార్ సాయి ఎలిమినేట్ అయినప్పటి నుండి కూడా రీ ఎంట్రీ విషయమై ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో ఆయనకు ప్రేక్షకులు కూడా మద్దతు తెలిపారు. మోనాల్ ను రక్షించడం కోసం కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు అంటూ బిగ్ బాస్ టీం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదు అని నిరూపించుకునేందుకు కుమార్ సాయిని రీ ఎంట్రీ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ గత రెండు మూడు వారాలుగా ప్రచారం జరుగుతుంది.
కుమార్ సాయి రీ ఎంట్రీ వార్తలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడంతో ఆయన స్థానంలో కుమార్ సాయి వెళ్తాడు అంటున్నారు. షో పూర్తి కాబోతున్న ఈ సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంత వరకు సబబు అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ బిగ్ బాస్ టీం ఈ సమయంలో కుమార్ సాయిని హౌస్ లోకి పంపిస్తే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 70 రోజులుగా కొనసాగుతున్న వారికి పోటీగా ఇప్పుడు ఒక వ్యక్తిని పంపించడం ఎంత వరకు ఫేర్ గేమ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. కుమార్ సాయి రీ ఎంట్రీ ఖచ్చితంగా పుకార్లే అయ్యి ఉంటాయి.