ఎద అందాలతో మెరిసిపోతున్న రాశిఖన్నా

Update: 2023-04-08 15:05 GMT
టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశిఖన్నా ఈ మధ్య గ్లామర్ డోస్ కాస్తా పెంచింది అని చెప్పాలి. టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ మీద ఉంది. హిందీలో రెండు సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. ఇక ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన రాశిఖన్నా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో దూసుకుపోతుంది.

 హీరోయిన్ గానే కాకుండా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలకి కూడా ఒకే చెబుతుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ నుంచి బయటకి రావాలని ప్రయత్నం చేస్తున్న ఈ బ్యూటీ ఆ దిశగానే తన సినిమాల ఎంపిక కూడా చేసుకుంటూ ఉండటం విశేషం. రాశిఖన్నా చివరిగా తెలుగులో నాగ చైతన్య హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన థాంక్యూ మూవీలో నటించింది.

ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తమిళంలో కార్తికి జోడీగా సర్దార్ సినిమాలో నటించింది. ఇక ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాశిఖన్నా నటించి మెప్పించింది. షాహిద్ కపూర్ కి జంటగా రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ఈ అమ్మడు రెచ్చిపోవడం విశేషం.

ఇదిలా ఉంటే హిందీలో యోద సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాశిఖన్నా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలని రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ విల్లా ఫ్యాషన్ ఈవెంట్ లో సందడి చేసింది.

ఈ ఈవెంట్ లో పింక్ కలర్ మోడరన్ అవుట్ ఫిట్ తో మెరిసిపోయింది. ఈ కాస్ట్యూమ్స్ లో ఎద అందాలని చూపిస్తూ కుర్రాళ్ళని రాశిఖన్నా టెంప్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. వీటిని ఏకంగా2.30 లక్షల మంది లైక్ చేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News