దశాబ్దంన్నర కిందట డీటీఎస్ సౌండ్ సిస్టమ్ తెలుగు సినిమాల్లో పెద్ద సంచలనం. ఆ సౌండ్ టెక్నాలజీ అమర్చుకోవడాన్ని థియేటర్లు ప్రతిష్టాత్మకంగా భావించేవి. థియేటర్ల పేర్ల వెనుక 70 ఎంఎం, ఏసీ అని తగిలించుకున్నట్లే.. డీటీఎస్ అని కూడా యాడ్ చేసేంత క్రేజ్ వచ్చింది ఆ టెక్నాలజీకి. ఏళ్లు గడిచేకొద్దీ డీటీఎస్ అనేది సాధారణ విషయమైపోయింది. ప్రతి థియేటరూ డీటీఎస్ అయిపోయింది. ఐతే టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఏదో ఒక కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. దాన్ని ఫిలిం మేకర్స్ అందిపుచ్చుకుంటూనే ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో సౌండ్ పరంగా ‘డాల్బీ అట్మాస్’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ ఏడాది వరుసగా కొన్ని పెద్ద సినిమాలు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రిలీజై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ‘డాల్బీ అట్మాస్’ గురించి బాగా ప్రచారం జరిగింది. ఆ టెక్నాలజీ ఉన్న థియేటర్లలో ‘బాహుబలి’ ప్రేక్షకులకు మరింత గొప్ప అనుభూతిని పంచింది. దీంతో శ్రీమంతుడు, కిక్-2 సినిమాలకు కూడా ఆ టెక్నాలజీ వాడారు. ఇప్పుడు నాని సినిమా ‘భలే భలే మగాడివోయ్’ను కూడా డాల్బీ అట్మాస్ లో విడుదల చేయబోతుండటం విశేషం. చిన్న సినిమా అయినప్పటికీ ఈ టెక్నాలజీ వాడుతుండటం చూస్తుంటే.. మున్ముందు సినిమాలన్నీ ‘డాల్బీ అట్మాస్’లో రిలీజైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సెప్టెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వం వహించిన ‘భలే భలే మగాడివోయ్’కి గోపీసుందర్ సంగీత దర్శకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక.