ఎస్పీ బాలు కోసం ప్రతీ సినీసెలబ్రిటీ ప్రార్థించాలని కోరిన ప్రముఖ డైరెక్టర్..!!
గత కొన్ని నెలలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వలన ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కరోనాకు మెడిసిన్ లేదా వాక్సిన్ లేకపోవడంతో ప్రజలలో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఇక సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, తేజ, సింగర్ స్మిత లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఈ నెల 5న లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో చేరిన ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు ఓ వీడియో రూపంలో స్వయంగా అందరికి సమాచారం అందించారు. అయితే కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని.. అలాగే జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిపిన ఆయన అనుమానం రాగానే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకున్నారట. ఇక కరోనా పరీక్షలలో తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడం వలన అడ్మిట్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్స్ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సలహా ఇచ్చారట. అలాగే దయచేసి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు బాలు. కానీ తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసియూకి తరలించినట్లు ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఈ సమాచారం తెలిసినప్పటి నుండి సినీ ఇండస్ట్రీలో.. ఆయన అభిమానులలో ఆందోళన మొదలైంది. వైద్యులు కూడా బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని చెబుతున్నారు. అందుకే గురువారం రాత్రి ఐసియూలో చేర్చారట. ఆయన కోలుకోవాలని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా స్పందించి.. "నా ప్రాణ స్నేహితుడు బాలుకు ఆత్మస్థైర్యం ఎక్కువ. అతనిలోని పట్టుదల, కృషి ఎంతో బలమైనవి. బాలు కొలిచే దేవుళ్లు, నేను పూజించే దైవాలు బాలును ఆరోగ్యవంతంగా మా వద్దకు చేరుస్తాయని నమ్మకం ఉంది. త్వరలో మా బాలు మా వద్దకు వస్తాడని ఎదురు చూస్తున్నాం" అని అన్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరు.. ప్రతీ సెలబ్రిటీ బాలు కోలుకోవాలని ప్రార్థించాలని భారతీరాజా కోరారు.