బెల్లంకొండ సురేష్. ఒకప్పుడు పెద్ద సినిమాల నిర్మాత. కాని జబర్ దస్త్ - అల్లుడు శీను వంటి సినిమాలతో ఈయనకు పంచ్ పడింది. క్వాలిటీ పేరుతో బడ్జెట్ ను పెంచేయడం.. ఎలాగైనా డేట్లు తగ్గించుకోవాలని హీరోయిన్లకు భారీ పారీతోషకాలు ఆఫర్ చేయడంతో.. ఈయన దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ లేకుండా పోయిదంటూ ఇండస్ర్లీలో టాక్ వినిపిస్తుంటుంది.
ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ''స్పీడున్నోడు'' సినిమాలో ఈయన డబ్బు పెట్టలేదా? పెట్టారా? తన డబ్బులనే దర్వకుడు భీమినేని ద్వారా ఆయన సినిమాలో పెట్టించారని ఒక టాక్ వినిపిస్తున్న సంగతి తెలసిందే. ఎందుకంటే ఈయన సొంత సినిమా అంటే అక్కడ కొంతమంది పంపిణీదారులు రిలీజ్ కానివ్వకుండా ఆపేస్తున్నారు కాబట్టి. అయితే ఇదే విషయాన్ని భీమినేనిని అడిగితే మాత్రం.. అబ్బే బెల్లంకొండ డబ్బులు లేనే లేవ్ అంటున్నాడు.
''సుడిగాడు సినిమా హిట్టయ్యాక రెండు మూడు సినిమాల మొదలవ్వాలి. కాని ప్రొడక్షన్ ఇష్యూస్.. వేరే ఇతరత్రా సమస్యల కారణంగా అవి మొదలవ్వలేదు. అందుకే ఈసారి ప్రొడక్షన్ పరమైన ఇబ్బందులు రాకూడదని.. నా సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నా. బెల్లంకొండ గారి దగ్గర నుండి ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఆయనా ఇవ్వలేదు'' అంటూ సెలవిచ్చాడు భీమినేని. నమ్మొచ్చా సార్?