యూత్ కింగ్ అఖిల్ అక్కినేని ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 'అఖిల్' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన అఖిల్ కు ఇది ఫస్ట్ కమర్షియల్ హిట్. నిజానికి తొలి సినిమా నుంచి సరైన సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న యువ హీరోకి.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టలేకపోవడం బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. ఏదైతేనేం అక్కినేని వారసుడు కాస్త లేట్ అయినా సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకొని లాభాల బాట పట్టాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ లో బన్నీ వాసు - వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్ళు రాబట్టింది. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా అఖిల్ సినిమా నిలిచింది.
బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ - డైరెక్టర్ భాస్కర్ సక్సెస్ అవడంలో.. అల్లు అరవింద్ - గీతా ఆర్ట్స్ కీలక పాత్ర పోషించారు. అలానే గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే - మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ అందించిన సంగీతం కూడా ప్లస్ అయ్యాయి. స్క్రీన్ ప్రెజెన్స్ లో ఫస్ట్ సినిమాతోనే తానేంటో చూపించిన అఖిల్.. ఈ సినిమాలో నటన - హావభావాలు చూపించడంలో మరో మెట్టు ఎక్కారనే చెప్పాలి. ఇక అఖిల్ - పూజాహెగ్డే ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలైట్స్ లో ఒకటిగా పేర్కొనవచ్చు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా చూపించిన కామెడీ - లవ్ స్టొరీ - సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే దసరా సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలసి థియేటర్లకు క్యూ కట్టారు. ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వడం కూడా సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవడానికి కారణమైంది. ఇక యుఎస్ లో అఖిల్ మూవీ హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి అక్కడ కూడా సత్తా చాటింది.
బ్యాచిలర్ సినిమా విజయం అఖిల్ తో పాటుగా అక్కినేని అభిమానులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న ''ఏజెంట్'' సినిమాతో అఖిల్ అంటే ఏంటో చూపిస్తారని ధీమాగా ఉన్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ ఓ స్పై గా కనిపించనున్నారు. ఇన్నాళ్లూ లవర్ బాయ్ పాత్రలు చేసిన అక్కినేని వారసుడు.. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాక్ అయ్యారు.
'ఏజెంట్' చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి కి చెందిన సురెండర్2 సినిమాస్ సంస్థ నిర్మాణ భాగస్వామి గా ఉంది. స్పై థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.