త్రిష.. రెమ్యునరేషన్ ఎక్కువే.. సినిమాలు ఎక్కువే..

అక్కడి నుంచి ఓ వైపు యంగ్ హీరోలు మరో వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ స్టార్ గా ఎదిగింది.

Update: 2024-11-30 05:09 GMT

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ. మొదట 1999లో ప్రశాంత్ సిమ్రాన్ జంటగా వచ్చిన ‘జోడీ’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. హీరోయిన్ అవ్వడానికి మూడేళ్ళ సమయం తీసుకున్న తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో త్రిష టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది.

అక్కడి నుంచి ఓ వైపు యంగ్ హీరోలు మరో వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ స్టార్ గా ఎదిగింది. రెండు దశాబ్దాల పాటు ఆమె స్టార్ హీరోయిన్ గానే తన ఇమేజ్ ని కొనసాగించింది. ప్రస్తుతం 41 ఏళ్ళ వయస్సులో ఉన్న త్రిష ఇప్పటికి తన ఛరిష్మాని కొనసాగిస్తోంది. నిజానికి ‘పొన్నియన్ సెల్వన్’ కి ముందు ఆమె కెరియర్ డ్రాప్ అయ్యింది. అయితే ఆ మూవీ ఇచ్చిన క్రేజ్ తో అవకాశాలు క్యూ కట్టాయి.

‘లియో‘ మూవీలో విజయ్ కి జోడీగా నటించి సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే అజిత్ తో నటించిన ‘విదాముయార్చి’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అలాగే అజిత్ తో చేస్తోన్న మరో మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ మూవీ కంప్లీట్ చేసింది. మలయాళంలో ‘ఐడెంటిటీ’ అనే మరో సినిమా కూడా పూర్తి చేసింది

వీటితో పాటు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మలయాళంలో మోహన్ లాల్ ‘రామ్’ సినిమాలలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా స్టార్ట్ అయిన ‘సూర్య 45’ మూవీలో కూడా త్రిష హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఇలా ఆమె చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష రెమ్యునరేషన్ కూడా కోటి రూపాయిల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా త్రిషనే ఇప్పుడు కనిపిస్తోంది ఈ ఏడు సినిమాలలో సరైన సక్సెస్ లు పడితే మరి కొంతకాలం ఆమె స్పీడ్ ని ఎవరు ఆపలేరని ట్రేడ్ పండితులు అంటున్నారు. త్రిషతోనే హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన చాలా మంది బ్యూటీస్ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నారు. అయితే 41 ఏళ్ళ వయస్సులో కూడా త్రిష స్టార్ హీరోలతో మూవీస్ చేస్తూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం విశేషం.

Tags:    

Similar News