రాష్ట్రంలో జరిగిన ఘటనలు గుర్తుకొస్తాయి: దిల్ రాజు
ఈ శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్రనిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన చాలా ఘటనలు ఈ సినిమా కథలో ఉన్నాయని అన్నారు.
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఈ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్రనిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన చాలా ఘటనలు ఈ సినిమా కథలో ఉన్నాయని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ''శంకర్ గారు ఈ కథను చెప్పిన మన రాష్ట్రంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. రామ్ చరణ్ గారు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉండబోతోంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. జనవరి 10న మా చిత్రం రాబోతోంది. పెద్ద విజయం సాధించబోతోన్నామనే నమ్మకంతో ఉన్నామ'' ని అన్నారు. ఈవెంట్ ముఖ్య అతిథి పవన్ కి థాంక్స్ చెప్పారు.
శంకర్ మాట్లాడుతూ.. 'గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు థాంక్స్. నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన మిమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారికి థాంక్స్. తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారు తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు. అంజలి గారు, కియారా గారు, శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర గారు, ఎస్ జే సూర్య గారు ఇలా అందరూ చక్కగా నటించారు. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు.
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. 'ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు. సినిమా సినిమాకి ఎదుగుతూ వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ ఇక్కడ జరుగుతుండటం సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమకు కావాల్సిన అనుమతులు, ప్రోత్సాహం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ సినిమా గేమ్ చేంజర్‌లా ఉండాలని కోరుకుంటున్నాను. నిర్మాత దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.
మాటపై నిలబడాలని పవన్ కళ్యాణ్ నేర్పారు: ఎస్.జె.సూర్య
ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన్ను ఇలా చూడటంతో నాకు మాటలు రావడం లేదు. ఈ ఈవెంట్ చరిత్రలో నిలవబోతోంది. ఆయన రావడమే ఈ ఈవెంట్‌కు ప్రత్యేకత. నా జీవితంలో ఏ ఆర్ రెహమాన్, పవన్ కళ్యాణ్ గారు నా ఆలోచనా ధోరణిని మార్చేశారు. ఖుషి కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులు చెప్పారు. ఓ పాటను, మూడు ఫైట్లను యాడ్ చేశారు. మాట ఇస్తే నిలబడాలి అని పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ గారు రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శంకర్ గారు విజన్, తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. రామ్ చరణ్‌తో నాకు ఉండే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పర్ఫామెన్స్‌కు అవార్డు వస్తుందని సుకుమార్ గారు చెప్పారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ఇరగ్గొట్టేశారు. సంక్రాంతికి రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.