రజనీ వదులుకున్న కమల్ హాసన్ బ్లాక్‌బస్టర్స్
విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించారు. అయితే ఆయన కొన్ని పాపులర్ చిత్రాలకు మొదటి ఎంపిక కాదు.;
విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించారు. అయితే ఆయన కొన్ని పాపులర్ చిత్రాలకు మొదటి ఎంపిక కాదు. రజనీకాంత్ కోల్పోయిన అవకాశాలను కమల్ హాసన్ సద్వినియోగం చేసుకుని గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి సినిమాల జాబితాను పరిశీలిస్తే..
కమల్ సూపర్ హిట్ చిత్రాలలో చాలా వరకు మొదట రజనీకాంత్ కు ఆఫర్ చేసినవే. అయితే రజనీ కమల్‌హాసన్ కు ఆ స్క్రిప్టు సరిపోతుంది అనుకుంటే, అతడికి సిఫారస చేసేవాడు. అలాంటి అవకాశాలను తిరస్కరించేవారు.
ఇండియన్ (భారతీయుడు) ఆఫర్ మొదట రజనీకాంత్ వద్దకే వెళ్లింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు మొదటి ఎంపిక రజనీ. ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ మేరకు శంకర్ ఆ స్క్రిప్టును మౌల్డ్ చేసారు. కమల్ హాసన్ కంటే ముందు, మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ చిత్రం దృశ్యం తమిళ రీమేక్ ను రజనీకాంత్ కు ఆఫర్ చేశారు. కానీ ఆయన అది చేయలేదు. ఆ తర్వాత ఆఫర్ కమల్ హాసన్ ని వరించింది. దృశ్యం ఫ్రాంఛైజీ చిత్రాలతో అతడు బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు.
స్టార్లు అరుదుగా కొన్ని ప్రత్యేకత ఉన్న పాత్రలను వదులుకుంటారు. కమల్ హాసన్ కూడా రజనీకాంత్ నటించిన `ఎంథిరన్` ఆఫర్‌ను తిరస్కరించారు. నిజానికి స్క్రిప్టు మొదట కమల్ వద్దకే వెళ్లింది. కానీ ఆ తర్వాత అతడు లైట్ తీస్కున్న తర్వాత రజనీకి శంకర్ వినిపించాడు. కమల్ హాసన్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ `థగ్ లైఫ్` కోసం సిద్ధమవుతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ నటిస్తున్నారు. థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలోకి రానుంది. రజనీకాంత్ నటించిన కూలీ విడుదల కావాల్సి ఉంది.