వ్యభిచారం కేసుతో హీరోయిన్ కెరీర్ ఖతం
జీవితమంటేనే ఎవరూ ఊహించనది. అదెప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులు కాదు.;
జీవితమంటేనే ఎవరూ ఊహించనది. అదెప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులు కాదు. అయితే వారి జీవితాన్ని కేవలం హిట్టూ, ఫ్లాపు మాత్రమే డిసైడ్ చేయవనేది ఒకప్పుటి స్టార్ హీరోయిన్ వినీతను చూస్తే అర్థమవుతుంది. తెలుగు ఆడియన్స్ కు కూడా వినీత సుపరిచితురాలే.
ఆమె అసలు పేరు లక్ష్మి. కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చాక వినీత అని పేరు మార్చుకుంది. వెంకటేష్ తో కలిసి నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో ఆమె టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికే వినీత తమిళ, మలయాళ భాషల్లో చాలా పెద్ద హీరోయిన్. ప్రభు, విజయ్ కాంత్, అర్జున్, శరత్ కుమార్ లాంటి వారితో నటించింది. మలయాళంలో మోహన్ లాల్ తో కూడా కలిసి నటించింది వినీత.
తెలుగు, తమిళ, మలయాళం ఇలా మొత్తమ్మీద వినీత 70కి పైగా సినిమాల్లో నటించింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా మంచి హిట్ అవడం, అదే టైమ్ లో హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లోకి కూడా అడుగు పెట్టడంతో ఇక వినీత కెరీర్ కు తిరుగులేదు అనుకున్నారంతా. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయింది.
2003లో వినీత వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లింది. తర్వాత బెయిల్ పైన బయటికొచ్చింది కానీ లాభం లేకపోయింది. వినీత తన తల్లి, సోదరుడితో కలిసి వ్యభిచార గృహం నడుపుతుందని అరెస్టైంది. ఆమెపై వచ్చిన ఆరోపణల వల్ల వినీత పర్సనల్ లైఫ్ తో పాటూ ప్రొఫెషనల్ లైఫ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.
సంవత్సరం పాటూ మానసిక క్షోభ అనుభవించిన తర్వాత ఈ కేసులో వినీతకు అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ లోపే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ కేసు తర్వాత ఆమెకు ఎలాంటి సినీ అవకాశాలు రాలేదు. ఛాన్సుల కోసం సంప్రదించినా "ఆడియన్స్ లో నీ క్రేజ్ ముగిసిందని" దర్శకనిర్మాతలు మొహం చాటేసేవారట.
ఇన్వెస్టిగేషన్ వల్ల తానెంతో క్షోభ అనుభవించానని, సమాజంలో తన పేరును నాశనం చేసేలా పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని తెలిపింది. అయితే కావాలనే ఎవరో వినీతపై తప్పుడు కేసు పెట్టి ఆమె కెరీర్ ను నాశనం చేశారని వినీత ఫ్యాన్స్ అంటుంటారు. సుమారు ఎనిమిదేళ్ల పాటూ ఇండస్ట్రీకి దూరమైన వినీత తర్వాత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన రెండు మూడు సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ వినీత సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వినీత తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం.