వేద వ్యాస్ తో ఎస్వీ కృష్ణారెడ్డి కంబ్యాక్ ఇస్తారా?
టాలీవుడ్ లో ఒకప్పుడు వచ్చినటువంటి కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు లేదు.;
టాలీవుడ్ లో ఒకప్పుడు వచ్చినటువంటి కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు లేదు. అప్పట్లో కామెడీ అంటే కామెడీగానే ఉండేది. అందులో ఎలాంటి డబుల్ మీనింగ్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కామెడీ అని చెప్పి డబుల్ మీనింగ్ డైలాగులు, క్రింజ్ కామెడీలు పెడుతున్నారు. రైటర్ల ధోరణితో పాటూ సినిమాలు చూసే ఆడియన్స్ ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోయింది.
జంధ్యాల, ఈవీవీ సత్యన్నారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలను ఇప్పటికీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నామంటే దానికి కారణం వారి క్లీన్ కామెడీ మాత్రమే. క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఎన్నో సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి.
90వ దశకంలో ఆయన్నుంచి వచ్చిన శుభలగ్నం, ఆహ్వానం, మావి చిగురు, యమ లీల ఎంతో బాగా ఆడాయి. ఆయన సినిమాల్లోని పాత్రలు, సీన్స్ మాత్రమే కాదు అందులోని పాటలు కూడా ఎంతో బావుంటాయి. ఆయన హీరోగా కూడా పలు సినిమాలు చేశారు కానీ అవేమీ ఆయనకు కలిసి రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటూ ఆయన డైరెక్షన్ కు దూరమయ్యారు.
మొన్నా మధ్య ఓ చిన్న మూవీ చేశారు కానీ అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయింది. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వేద వ్యాస్ అనే కథను రాసుకున్న ఆయన దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారని సమాచారం.
ఆ సినిమా కోసం చైనా, మలేషియా దేశాల నుంచి కొంతమంది యాక్టర్లను కూడా సెలెక్ట్ చేస్తున్నారట కృష్ణారెడ్డి. ఈ సినిమాకు ఆయనే మ్యూజిక్ అందించనున్నానని, ఆల్రెడీ సాంగ్స్ కూడా రెడీ అయ్యాయని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తానని కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఆయన తరహా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు టాలీవుడ్ లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు ఆయన్ని ఆయన మార్చుకుని సినిమాను తీయగలగాలి. మరి వేద వ్యాస్ లో ఎలాంటి నటులు నటిస్తారు? ఆయన ఏ జానర్ లో సినిమా తీస్తాడనేది తెలియాల్సి ఉంది.